‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అంటూ, వైశ్యుల పై అనుచితంగా పుస్తకం రాసి, సమాజంలో కులాల మధ్య గోల పెట్టిన కంచ ఐలయ్య గోల విజయవాడని తాకింది... ఈయనగారు హైదరాబాద్ లో కూర్చుని ఏ గోల అయినా చేసుకున్నా పరవాలేదు... కాని ప్రశాంతంగా ఉన్న విజయవాడ మీద ఈయన కన్ను పడింది... కొంత మంది అనుచగణంతో కలిసి ఈ నెల 28న ఛలో విజయవాడ అని పిలుపి ఇచ్చి, బారి మద్దతు సభకు సన్నాహాలు చేశాడు కంచె ఐలయ్య... కంచె ఐలయ్యకు సన్మానం చేస్తామని, జింఖానా గ్రౌండ్స్‌లో పర్మిషన్ ఇవ్వాలి అని అడిగారు ఆయన మద్దతుదారులు...
ఇదే సందర్భంలో, అదే తేదిన, అదే ప్లేస్ లో, అదే రోజున ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాయి. విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో సభ నిర్వహణ కోసం ఇరువర్గాలు పోలీసుల అనుమతి కోరాయి. దీంతో, ఒకే రోజు ఒకే చోట రెండు సంఘాలు అనుమతి కోరడంతో, ఇరు వర్గాలకి పోలీసులు ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు కానుంది.
వేదికగా విజయవాడ ను ఎంచుకోవడంలో ఆంధ్రలో కూడా తనకు మద్దతుదారులు ఉన్నారు అని చెప్పుకోవడానికి, సామాజిక వర్గం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తద్వారా ఆర్యవైస్యుల పై దాడి చేయటానికి ప్లాన్ చేశారు... అంతే కాదు, సభ యొక్క ప్రధాన డిమాండ్ గా ఐలయ్య పై కేసులు ఎత్తివేయాలని, రక్షణ కావాలి, దాడులు ఆపాలి, కోమాటోల్ల షాప్స్ బహిష్కరించాలని ఈ సభ కోసం తాయారు చేసిన కరపత్రంలో పేర్కొన్నారు. నిజానికి ఇది ఐలయ్య, ఆయన వెనుక ఉన్నవారు వ్యహత్మకంగా విజయవాడని ఎన్నుకున్నారు... ఇలాంటి వేషాలు హైదరాబాద్ లో వేస్తే, కెసిఆర్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి, విజయవాడలో పెట్టి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో కుల, మత వివాదాలు చోటు చేసుకునే మంచి అవకాశం దొరికిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పార్టీ రంగంలోకి దిగింది. దీంతో పోలీసులు ఈ పన్నాగం పసిగట్టి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు...