ముఖ్యమంత్రి కుర్చీ... ముఖ్యమంత్రి కుర్చీ... ముఖ్యమంత్రి కుర్చీ... ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక టార్గెట్ ఇదే... అందుకే, ఎప్పుడు నోరు తెరిచినా, ఆఫ్టర్ 2 ఇయర్స్ కింగ్ అంటున్నారు... ఇంకా ముందుకెళ్ళి, నేను ముఖ్యమంత్రి అవ్వటం కోసం, మీ అందరూ గెట్టిగా ప్రార్ధించండి అని ప్రజలకే ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు.. తప్పు లేదు... ఏ రాజకీయ నాయకుడు టార్గెట్ అయినా, ముఖ్యమంత్రి కావాలనే ఉంటుంది... కాని, అది అందుకోవాలి అంటే, ప్రజల ఆశీర్వాదం కావలి... ప్రజల ఆకాంక్ష ఏంటో తెలుసుకుని, వారి మన్ననలు పొందాలి... మరి జగన్ ఏమి చేస్తున్నాడు ?
ముందుగా పాదయాత్ర విషయానికి వద్దాం... ఎప్పుడో రెండు నెలల క్రితం, నేను అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తున్నా అని ఆర్భాటంగా ప్రకటించారు.. తరువాత, జ్యోతిష్యులు చెప్పారని, నవంబర్ 2కి వాయిదా పడింది.... తరువాత కోర్ట్ శుక్రవారం పర్మిషన్ ఇవ్వలేదు అని, నవంబర్ 2 పాదయాత్ర మొదలు పెట్టి, నవంబర్ 3 కోర్ట్ కి పొతే, జనం నవ్వుతారని, మళ్ళీ నవంబర్ 6కి వాయిదా వేసాడు... చివరగా, వారానికి నాలుగు రోజుల పాదయత్ర ఫిక్స్ చేశాడు.. ఇప్పుడు మళ్ళీ "అన్న వస్తున్నాడు" అని పాదయాత్రకి పెట్టిన పేరు మార్చేసారు... మరి ఇది జ్యోతిష్యులు చెప్పారో, న్యుమరలాజీ వాళ్ళు చెప్పారో కాని, ఇప్పుడు పాదయాత్ర పేరు ‘ప్రజా సంకల్పం’గా మార్చారు.
ఇప్పుడు ఈ పేరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి.... ‘ప్రజా సంకల్పం’ అంటే ప్రజలు కోరుకునేది... ప్రజల ఆకాంక్ష నెరవేరేది... ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చేసే పాదయాత్ర ప్రజల సంకల్పం ఎలా అవుతుంది ? ఈయన సొంత స్వార్ధం కోసం, కేసుల నుంచి తప్పించుకునటం కోసం చేసే యాత్ర ప్రజల సంకల్పం ఎలా అవుతుంది ? నిజానికి ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’ వేరు... అద్భుతమైన రాజధాని కావలి అనేది మా ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’... పోలవరం పూర్తి కావలి అనేది మా ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’... పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలి అనేది ‘ప్రజా సంకల్పం’... ప్రజలకు ఇవి ఎవరు చేస్తున్నారో, చేస్తారో పూర్తి క్లారిటీ ఉంది... ఇవి ఆపటం కోసం, ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఇంకా క్లారిటీ ఉంది... తప్పకుండా ‘ప్రజా సంకల్పం’నెరవేరుతుంది జగన్ గారు..