దక్షిణాదిలో అధికారం కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి టార్గెట్ చేరుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి పోలవరం ప్రాజెక్టు ఇబ్బందిగా పరిణమించనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణమైన కాంట్రాక్టు సంస్థను మార్చేందుకు కేంద్రం ససేమిరా అంటున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ఇదంతా కావాలనే చేస్తుందా అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి అభిమతం. వాస్తవానికి జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులను కేంద్రమే నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిత్యం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సోమవారం పోలవరం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష జరపడం, తరుచూ ప్రాజెక్టులను సందర్శించడం చేస్తున్నారు. ఎప్పటికప్పడు అధికారులను, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేస్తూ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం మందగించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు చేపట్టిన ప్రధాన కాంట్రాక్టర్ Transtroy సంస్థ వలనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పనులు సకాలంలో పూర్తికావనే నిర్ధారణకు వచ్చి, నిర్మాణ సంస్థను మార్చాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. గ్లోబల్ టెండర్ల ద్వారా కొత్త సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో జరుగుతుందని కేంద్రం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ఇప్పటికిప్పడు కాంట్రాక్ట సంస్థను మార్చితే నిర్మాణ వ్యవయం పేరుగుందనే అభిప్రాయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు. చంద్రబాబు స్వయంగా వెళ్లి కలిసినా, కేంద్రం వైఖరిలో మార్పు లేదు...

బీజేపీ పార్టీ నేతలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి కాకుంటే ఆ ప్రభావం బీజేపీ పై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థను మార్చకుంటే ఆ నెపాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కేంద్రం పై నెడుతుందని, అది అంతిమంగా ఏపీలో బీజేపీ ప్రతిష్టను దిగజార్చుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూసేకరణ బిల్ పక్కన పెట్టటంతో అమరావతి, మిగతా ప్రాజెక్ట్ లు లేట్ అవుతున్నాయి అని, దానికి కేంద్రమే కారణం అని ప్రజల్లోకి బాగా వెళ్ళింది... దానికి తోడు, అచ్చు గుద్దినట్టు అదే విధంగా ఉన్న తెలంగాణా, గుజరాత్ భూసేకరణ బిల్ ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ బిల్ తొక్కి పెట్టారు అని, కేంద్రం పై ప్రజలు గుర్రుగా ఉన్నారు... ముఖ్యమంత్రి పోలవరం కోసం ఎంత తపన పడుతున్నారో, ప్రజలు చూస్తూనే ఉన్నారు... కేంద్రం ఇలాగే కావాలని కాలయాపన చేస్తే, ప్రజలు తీవ్రంగా స్పందించటం ఖాయం అని రాష్ట్ర బీజేపీ నేతలే అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read