ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి శాసనసభ్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... సీనియర్ నాయకుడిగా ఉన్న కోడెల అనేక సందర్భాల్లో ప్రజలను ఆదుకుంటూ తన పర్సనల్ డబ్బులు కూడా ఇచ్చి ధాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లా నరసారావుపేట రోడ్డులో జరిగింది.
అసెంబ్లీ స్పీకర్ కోడెల, గుంటూరు జిల్లా నరసారావుపేట రోడ్డులో ప్రయాణిస్తున్నారు... సడన్ గా కాన్వాయ్ ఆగింది... అక్కడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే, కోడెల ఒక కొట్టు దగ్గరకు వెళ్లి, ఆ యజమానితో మాట్లాడి, ఆయన బాధలు తెలుసుకుని డబ్బు సహాయం చేసి ధాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ పరిణామంతో అక్కడి ప్రజలు కోడెలను మెచ్చుకున్నారు... నరసారావుపేట రోడ్డులో కోట రామారావు చిన్న షాపు పెట్టుకుని గత కొన్నేళ్లుగా పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. స్పీకర్ కోడెల ఆ రోడ్డులో వెళ్లినప్పుడల్లా షాపును గమనిస్తుండేవారు.
అయితే గత కొన్ని నెలలుగా షాపు వద్ద జనాలు కనిపించకపోవడంతో సొంతూరుకు వెళుతున్న కోడెల, కాన్వాయ్ ఆపి ఆ షాపు వద్దకు వెళ్లి, 70 ఏళ్లు పైబడిన రామారావుతో కాసేపు మాట్లాడారు. రామారావు కోడెల రాకను చూసి ఆశ్చర్యపోయారు... సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ తన కొట్టుకు రావటంతో, సంతోషపడుతూనే, ఆయన బాధలు చెప్పుకున్నారు... 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, గతంతో పోలిస్తే వ్యాపారం బాగా తగ్గిపోయిందని, తనకు కూడా ఓపిక లేదని ఆయన వాపోయారు. ఈ మధ్య పొగాకు వాడకం మీద ప్రజలకు అవాగాహన బాగా పెరిగిందని, అందుకే వ్యాపారం సరిగా లేదని, వేరే వ్యాపారం చేసుకోమని కోడెల సలహా ఇచ్చారు. తక్షణం రామారావుకు రూ. 4వేలు ఆర్థిక సాయం చేయడంతోపాటు ఏదైనా సహాయం కావాలంటే తనను కలవమని చెప్పారు.