ఇండిగో ఎయిర్ లైన్స్, చెప్పినట్టే, మన రాష్ట్రంలో భారీ ప్రణాళికతో అడుగు పెడుతుంది... అందులో కొన్ని అంతర్జాతీయ సర్వీసులకు షడ్యుల్ కూడా విడుదల చేసింది... గన్నవరం ఎయిర్ పోర్ట్ గురించి ఇంకా వివరాలు చెప్పకపోయినా, తిరుపతి, రాజమహేంద్రవరం నుంచి 63 అనుసంధానాలు ఉంటాయని ప్రకటించింది..
తిరుపతి, రాజమహేంద్రవరంల నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర నగరాలకూ ప్రయాణించేలా కనెక్టింగ్ విమాన సర్వీస్లు నడపనున్నట్లు ఇండిగో స్వయంగా వెల్లడించింది... ఎయిర్ బస్ 320, ఏటీఆర్ లతో కూడిన తమ ప్రస్తుత నెట్వర్క్కు తిరుపతి, రాజమహేంద్రవరంలను జత చేసేందుకు కొత్తగా 63 అనుసంధానాలు ఉంటాయన్నారు. ఈ రెండు నగరాల నుంచి సింగపూర్, దుబాయ్, మస్కట్లతో పాటు దిల్లీ, ముంబయి, కోల్కతాలకు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మంగళూరు మీదుగా ప్రయాణించవచ్చని ఇండిగో ప్రధాన వాణిజ్య అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
దీనికి సంబంధించి జనవరి 9,16వ తేది షడ్యుల్ కూడా విడుదల చేసింది... బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు అని తెలిపింది... చెన్నై రూట్ లో తిరిగే విమాన సర్వీస్లు: Port Blair-Rajahmundry, Kolkata-Rajahmundry, Rajahmundry-Singapore, Rajahmundry-Muscat. అలాగే కొత్త రూట్లు: Chennai-Rajahmundry via Hyderabad, Rajahmundry-Chennai via Hyderabad, Chennai-Tirupati via Bengaluru, Tirupati-Chennai via Bengaluru, Thiruvananthapuram -Tirupati via Bengaluru, Kochi -Rajahmundry via Bengaluru