కులాల ముసుగులో రాష్ట్రంలోని సాడిస్ట్ లు, ఎలా రేచ్చిపోయారో, తునిలో చూశాం... కాపులు అందరూ మీటింగ్ పెట్టుకుంటే, అందులో దూరిన సంఘ విద్రోహ శక్తులు, రాష్ట్రంలో అశాంతి రేగించి, రాజకీయంగా లబ్ది పొందటానికి, ట్రైన్ తగలబెట్టి, ఆ నెపం కాపుల మీద తోసెయ్యటం చూసాం... ఇప్పుడు అలాంటి కులాల గొడవకి, ఇవాళ విజయవాడ వేదిక కానుంది.. ఐలయ్యకు సన్మానం అంటూ, హైదరాబాద్ బ్యాచ్, బెజవాడలో అలజడకి ప్లాన్ చేసింది... పోలీసు, పెర్మిషన్ లేదు అంటున్నా, 144 సెక్షన్ ఉన్నా, మేము చేసేది చేసేదే అంటూ, రెచ్చిపోతున్నారు...
కంచ ఐలయ్యను విజయవాడకు తీసుకొచ్చి సత్కరించాలని రిజర్వేషన్ల పోరాట సమితి మాటున ఒక రాజకీయ పార్టీ ప్లాన్ చేసేంది, దానికి పోటీగా ఆత్మీయ సభను జరిపి తీరాలని ఆర్యవైశ్య, బ్రాహ్మణులు సిద్దమవుతున్నారు. అనుమతి లేదని పోలీసు అధికారులు కచ్చితంగా చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నాయి. పరిణామాలను పరిశీలించిన అధికారులు సెక్షన్ 144 సెక్షన్ 80లను అమలు చేస్తోంది. నెల రోజులపాటు ఈ రెండు సెక్షన్లు అమల్లో ఉంటాయి. రెండు సభలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు ఆయా నేతలకు నోటీసులు జారీ చేశారు. మీరు శనివారంనాడు జింఖానా గ్రౌండ్లో నిర్వహించే సభకు అనుమతి లేదు. మీరు ఇంటి నుంచి బయటకు రావద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే కరిఠన చర్యలు తీసుకుంటాం' అని నోటీసుల్లో హెచ్చరిస్తున్నారు. విజయవాడలోని రెండు వర్గాల నేతలకూ ఈ నోటీసులు పంపినప్పటికీ కొంతమంది తీసుకోవడానికి నిరాకరించారు. హైదరాబాద్లోని తార్నాకలో ఉంటున్న ఐలయ్య ఇంటికీ నోటీసును పంపారు.
రెండు వర్గాలు విజయవాడలో వాతావరణాన్ని వేడిక్కెస్తున్న తరుణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గొడవలు జరపటానికి ఆరితేరిన గుండాలను ఒక రాజకీయ పార్టీ సిద్ధం చేసింది అని తెలీటంతో, నగరంలోని అన్ని లాడ్డిలను క్షుణంగా పరిశీలించారు. జింఖానా గ్రౌండ్ ను పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయం, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లలో కటుదిట్టమైన నిషూ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఐలయ్య విజయవాడలో అడుగుపెడితే అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం రాత్రి కమిషనరేట్లో పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 15 ప్లాటూన్లు రంగలోకి దిగాయి అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు... పోలీసులు మాత్రం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, తాట తీస్తాం అంటున్నారు...