తెలీనోడికి ఒకసారి చెప్తాం... ఎడ్డెం అంటే తెడ్డెం అనే వాడికి రెండు సార్లు చెప్తాం... మూర్ఖుడికి మూడు సార్లు చెప్తాం... ఎన్ని సార్లు చెప్పినా అర్ధం చేసుకోలేనివాడిని... సారీ అర్ధం చేసుకోకపోవటం కాదు, కావాలని విషం చిమ్మే వాళ్ళని సైకోలు అనక ఏమి అంటారు ? సైకోలు అనే పేరు కూడా వీళ్ళకి చిన్నదే ఏమో... సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, అరగంట సేపు పట్టిసీమ ఎలా పని చేస్తుందో చెప్పారు... చెప్పే మూడేళ్ళు అయ్యింది... మూడు సంవత్సరాల నుంచి, కృష్ణా డెల్టా రైతులని కాపాడింది పట్టిసీమ... కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా నీరు, రాయలసీమకు ఇచ్చి, రాయలసీమ రైతులని కాపాడారు.... పట్టిసీమ పని చేసేది, కేవలం వృధగా సముద్రంలోకి పోయేటప్పుడు మాత్రమే, దీంతో గోదావరి రైతులకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు... వారికి సాటి రైతుల బాధలు తెలుసు కాబాట్టి, వృధాగా పోతున్న నీరు, కృష్ణా డెల్టా రైతులకి ఇవ్వటానికి సహకరించారు...

jagan pattiseema 27102017 2

రాష్ట్రం పచ్చగా ఉంది... అంతే ఈ సైకోలు చూడలేకపోతున్నారు... ఎలాగైనా గోదావరి, కృష్ణా డెల్టా రైతుల మధ్య చిచ్చు పెట్టె ప్లాన్ వేసారు... పత్రిక మాటున రాజకేయ వ్యభిచారం చేస్తున్నారు... "పట్టిసీమతో తోడేస్తున్నారు" అంటూ సాక్షి విషం చిమ్మింది.... అసలు సబ్జెక్టు తెలీదు...తెలిసిందల్లా విషం చిమ్మటమే... ఎక్కడన్నా స్టోరేజ్ ఉందా అక్కడ ? ధవళేస్వరం దగ్గర ఎంత నీరు ఆగుతుంది, ఇప్పుడు ఎంత నీరు సముద్రంలోకి పోతుంది ?సముద్రంలోకి పోయే నీళ్ళు తీసుకుపోతుంటే కూడా, దాని తోడేయ్యటం అంటారా ? అంటే సముద్రంలోకి పోయినా పర్వాలేదు, కృష్ణా డెల్టా రైతులు నీళ్ళు వాడుకోకూడడా ? వాటర్ లెవెల్ తగ్గిపోగానే, పట్టిసీమ ఆపేస్తారని తెలీదా ? ఇలా అబద్ధపు ప్రచారం చేస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బ్రతికేయటమేనా ? ఇదేనా రాజాకీయం ? కృష్ణా రైతులు తూ అన్నారు... గోదారోళ్లు ఛీ కొట్టారు.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలన్న కుతంత్రమా?

jagan pattiseema 27102017 3

ఇవే రాతలు నీ యాత్రలో పెట్టి, రైతుల రియాక్షన్ ఏంటో చూడు... గోదావరి నీళ్లు తోడేసి, తెలంగాణకో, మహారాష్ట్రకో, కర్ణాటక కో, ఒడిశాకో, నీళ్లు అమ్ముకుని , రాష్ట్రంలో రైతులుకి నీరు లేకండా చేస్తే అది తప్పు అవుతుంది... నిన్న గోదావరి కి రాజమండ్రి వద్ద ప్రవాహం 44000 క్యూసెక్కుల... అన్ని కాలువల ద్వారా, పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చిన తరవాత సముద్రం లోనికి వదిలేసిన నీరు 33000 క్యూసెకులు... గోదావరి నీళ్లు తోడేస్తున్నారు అని ఏడుస్తూనారు.. .అలా అనుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కూడా వేస్ట్... పోలవరం కడితే ధవళేశ్వరం ఒక బాలన్స్ బ్యారేజి గా ఉపయోగపడుతుంది... పోలవరం పూర్తి అయితే పోలవరం నిండితే గాని ధవళేశ్వరంకి నీరు రాదు.. అప్పుడు పోలవరంలో ఆపేశారు అని ఏడుస్తారా ?? తనకు, తన పార్టీకి, ఓటు వెయ్యని వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకునే భయంకరమైన శాడిస్టు మనస్తత్వం ఆ పార్టీ నాయకుల సొంతం.. రాష్ట్రంలో ప్రాంతాలు కులాలు మధ్య చిచ్చు పెట్టి అరాచకం సృష్టించాలి అనే పార్టీ మనకి అవసరమా ?? పద్ధతి మార్చుకోండి ఇలాంటి రాతలు మార్చుకోండి... గత ఎన్నికల లో గోదావరి జిల్లాలు లో 34 కి 5 గెలిచారు.... ఇలాంటివి చేస్తూ ఉంటే, ఈ సారి ఎన్ని యాత్రలు చేసిన ఒక్కటి కూడా గెలవరు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read