సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అంటే దొంగలకి, 420 కేటుగాళ్ళకి ఎంత భయమో వేరే చెప్పాల్సిన పని లేదు... సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం, జగన్ అక్రమ ఆస్తుల కేసులు అన్నీ సమర్ధవంతంగా దర్యాప్తు చేసిన హానెస్ట్ ఆఫీసర్ ఈయన... కాగా, ఆ సమయంలో జరిగిన ఓ కీలక పరిణామం ఇప్పుడు ఈడీ వెలుగులోకి వచ్చింది.
కోనేరు రాజేంద్రప్రసాద్.. రాజశేఖర్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగాడు... జగన్ పార్టీ తరుపున, 2014 ఎలక్షన్స్ లో, విజయవాడ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసారు..ఎమ్మార్ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్ను సీబీఐ కేసు నుంచి తప్పించడానికి ఆయన కుమారుడు కోనేరు ప్రదీప్ మాంసం ఎగుమతిదారు ఖురేషీ ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఈ "జే" గ్యాంగ్, లక్ష్మీనారాయణని తప్పించటానికి 6.5 కోట్లు దాకా ఖర్చు చేసింది... అంతే కాదు, ఈ "జే" గ్యాంగ్, లక్ష్మీనారాయణ లాంటి హానెస్ట్ ఆఫీసర్ కి పెట్టిన పేరు, 'హైదరాబాద్ డాగ్"... ఈ మాట వింటే రక్తం మరుగుతుంది కదూ... ఇది వీళ్ళ బ్రతకులు, అంటూ ఈడీ ఆ ఫోన్ సంభాషణ కూడా చార్జ్ షీట్ లో పెట్టింది...
16 వ తేదీ 2013న హైదరాబాద్ డాగ్ ఈజ్ కమింగ్ టూ ఢిల్లీ సేమ్ ప్లైట్ అజ్ డాడ్. .. ఖరేషీ కూడా రిప్లే ఇచ్చారు. వై డూ యూ థింక్ డాగ్ కమింగ్ దేర్ ఇప్ బాస్ నాట్ ఇన్ టౌన్..అని చేశారు. ఈ మెసేజ్ లను ఏ.పి. సింగ్ కు ఖురేషీ చూపించినట్లు ఈ.డీ. పెర్కొంది. మరో మెసేజ్ ఎప్రిల్ 30న జే.డీ. బదిలీ కోర్టు అదేశాల పై చేసినట్లు ఈ.డీ. తెలిపింది. అయితే జేడీ ట్రాన్స్ ఫర్ కోసం 5.7 కోట్ల రూపాయలను ఖురేషీకి ఇచ్చినట్లు కొనేరు ప్రదీప్ ఈ.డీ. విచారణలో ఒప్పుకున్నారు.