6 నెలల పాటు శుక్రువారం కోర్ట్ కి రాకుండా, మినహాయింపు ఇవ్వండి, నేను పాదయాత్ర చేసుకోవాలి అని, జగన్ సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే...
దీని మీద నిన్న సిబిఐ కోర్ట్ లో వాదనలు జరిగాయి.... సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చేసిన వాదనకు, జగన్ లాయర్లు అవాక్కయ్యారు... జగన్ జగన్ అభ్యర్థను సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కోర్టు అనుమతి తీసుకోకుండానే విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, నేను ఆరు నెలలు పాదయాత్ర చేస్తా అని, ఎలా బహిరంగ ప్రకటన చేస్తారని సీబీఐ వాదించింది... పైగా పాదయాత్రకు సంబంధించి తేదీలతో సహా..కరపత్రం కూడా ముద్రించారని సీబీఐ కోర్టుకు నివేదించింది..
జగన్మోహన్ రెడ్డికి అసలు విచారణ ప్రక్రియపై ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. రాజకీయ అవసరాల కోసం విచారణకు రాకుండా ఉండటం సరికాదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
సీబీఐ కోర్టు ఈ అంశంపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.