ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు... ఆకస్మిక తనిఖీల ద్వారా వాస్తవ పరిస్థతులు తెలుసుకునేందుకు, శనివారం పొద్దున్నే చంద్రబాబు పర్యటన మొదలు పెట్టారు...

ముందుగా బందర్ కాలువ దగ్గర గ్రీనరి, కంట్రోల్‌రూం సమీపంలోని స్క్రాప్‌ పార్కులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చంద్రబాబు తనిఖీలు నిర్వహించారు. పార్క్‌కి ఆనుకుని ఉన్న కాల్వగట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను చంద్రబాబు పరిశీలించిన అనంతరం గవర్నర్‌పేటలోని ఆర్టీసీ-2 డిపోలో తనిఖీలు చేస్తున్నారు.

అక్కడ నుంచి బయలుదేరి సిటీ మీదుగా రామవరప్పాడు రింగ్ చేరుకొని, అక్కడ ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తెలుసుకున్నారు.. రామవరప్పాడు రైల్వే స్టేషన్ వంతెన వెంటనే మొదలు పెట్టమన్నారు... రామవరప్పాడు నుంచి గన్నవరం దాకా రోడ్డు వెడల్పు చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టమన్నారు.

అలాగే ప్రసాదంపాడులో సానిటేషన్ చూసి అధికారులని మందలించారు... 9 గంటలు అయినా, ఎందుకు చెత్త తెయలేదు అని నిలదీశారు...

చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read