చంద్రబాబు ప్రభుత్వం నీరుకి ఎంత ప్రాదాన్యత ఇస్తుందో తెలిసిందే.. ఒక పక్క రాష్ట్రాన్ని కురువురహితం చేస్తూ, ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న చంద్రబాబు, జలసిరికి హారితి అంటూ, నీటిని పూజించమంటున్నారు. ముఖ్యమంత్రి మంచి మనసుతో చేసిన జలసిరికి హారతి కార్యక్రమం వల్ల ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉండి వరుణ దేవుడు కరుణించి రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. ఇది ఇలా ఉండాగా, 28 సాగునీటి ప్రాజెక్టులు పుర్తిచేయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఆ దిశగా అడుగులు వేస్తుంది...
డిసెంబరులోగా పూర్తిచేయాల్సిన 28 సాగునీటి ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయని జల వనరులశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు. కోగుళ్లు, ఎర్ర కాల్వ, కండలేరు లిఫ్టు, మారాల, చెర్లోపల్లి, సిద్ధాపురం, నర్సింహరాయ సాగర్, గోరకల్లు, అవుకు టన్నెల్, పెదపాలెం (గుంటూరు) చిన్నసాన ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తయిన 10 ప్రాజెక్టులకు మూడురోజుల పాటు వరుస ప్రారంభోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేవిధంగా ఏ నిర్మాణ సంస్థయినా నిర్ధేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొండవీటివాగు డిసెంబరులోగా పూర్తిచేయాలని నిర్దేశించారు.