గత మూడు నెలలుగా దడదడలాడిస్తున్న ఆంధ్రా ఏసీబీకి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది... సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి కూడా మన ఆంధ్రా ఏసీబీని మెచ్చుకున్నారు... ఇప్పుడు పోలీస్ శాఖ పై ఏసీబీ దృష్టి సారించింది. సీఐడీ డీఎస్పీ ఎద్దుల హరినాధ రెడ్డి అక్రమాలతో ఖంగుతిన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, మాతృ సంస్థలోని అధికారుల అక్రమాల పై కన్నేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు అవినీతిపరులైన డీఎస్పీ స్థాయి అధికారుల జాబితాను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

acb 31102017 2

మద్యం, ఇసుక, క్రికెట్ బెట్టింగ్ లు.. ఇలా ఆదాయం వచ్చేఅన్ని అక్రమాలను కొందరు డీఎస్సీ స్థాయి అధికారులు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పోలీసు శాఖలోని డీఎస్పీ స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు విస్తృతమయ్యాయి. రాయలసీమ లోని కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పని చేసిన హరినాధ రెడ్డి రూ. కోట్లకు పడగలెత్తారు. ఏసీబీ అధికారుల దాడుల్లో రూ.50 కోట్లకు పైబడి హరినాధ రెడ్డి అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆరు మాసాల కిందట గుంటూరు జిల్లాకు చెందిన ఓ డీఎస్పీ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించినప్పడు బాధితులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

acb 31102017 3

మద్యం, ఇసుక, క్రికెట్ బెట్టింగ్ లు, ఇసుక మాఫియా, సివిల్ వివాదాల్లో కోట్లు కోట్లు సంపాదిస్తున్న అవినీతి పోలీసుల అంతు చూడాలని ఏసీబీ నిర్ణయించింది... ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మల్యేల ఒత్తిడిలు ఉంటాయి అని భావించి, దీనికి సంబంధించి ముందే ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది... ముఖ్యమంత్రి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read