జగన్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అంటూ, వైసీపీ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మల్యేలకు ఆదేశాలు జారీ చేసేంది... కీలకమైన బడ్జెట్ సమావేశాలు అయినా వెళ్ళద్దు అని చెప్పేశారు... అయితే, ఈ నిర్ణయం పట్ల, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే... పజ్రల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటే విమర్శలు వస్తున్న తరుణంలో, వైసీపీ ఎమ్మల్యేలు ప్రజా వ్యతిరేకత వస్తుంది అనే భయంలో ఉన్నారు... దీంతో అందరూ, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్లి, జగన్ నిర్ణయం మార్చుకోమని వేడుకున్నారు...
పోయినసారి అసెంబ్లీకి వెళ్ళకుండా పోలవరం, కాపు రిజర్వేషన్ లాంటి అంశాల్లో చంద్రబాబుకి అనుకూలం అయ్యేలా చేసామని, వారు విజయసాయి దగ్గర వాపోయారు... ఇలాంటి సమస్యలు ప్రజల ఎమోషన్ తో డైరెక్ట్ గా ముడి పడిన సమస్యలని, ఇలాంటి టైంలో మనం అసెంబ్లీలో లేకుండా చాలా తప్పు చేసామని, మనం అసెంబ్లీలో ఉంటే మన వాయిస్ కూడా ప్రజలకు చెప్పే వీలు ఉండేదని, చంద్రబాబుని ఎదో రకంగా ఇరికించే అవకాసం కోల్పయమని చెప్పారు... అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని వారు విజయసాయిని ప్రశ్నించారు...
దానికి విజయసాయి వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు... జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, అది శాసనం అని మీకు తెలియదా ? కొత్తగా ఇలా వచ్చి నన్ను అడుగుతారేంటి ? అయినా ఇలాంటి వాటితో మనకి పని లేదు... అసెంబ్లీకి వెళ్ళినా, మిమ్మల్ని చంద్రబాబు ఆడుకుంటారు... అయినా ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు.. మనం అధికారంలోకి వస్తున్నాం.. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం... అన్నీ అనుకూలిస్తే, నేను కేంద్ర మంత్రిని అవుతాను... మీలో కూడా మంత్రులు అవ్వచ్చు... భయాలు పెట్టుకోవద్దు.... జగన్ ను నమ్ముకోంది, అని వారిని తిప్పి పంపించి వేసారు...