జగన్ కి అత్యంత ఆప్తుడు, 12 ఓట్లతో గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... రాజధాని ప్రాంతంలో ఉంటూ, రాజధాని వద్దు అని, జగన్ చెప్పినట్టు అమరావతి మీద కోర్ట్ లలో కేసులు వేస్తూ, రాజధానిని అడ్డుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న ఈయన, ఇప్పుడు మరో కేసు వేశారు.. కాని ఈ సారి అమరావతి మీద కాదు...

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం, ఈ కనెక్షన్ లు ఇవ్వనున్నారు...

ఈ తరుణంలో, ఫైబర్నెట్ ద్వారా కేబుల్ టీవీ/టీవీ ఛానళ్ల ప్రసార రంగంలోకి అడుగిడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్ట్లో కేసు వేశారు. మీడియా ప్రభుత్వ నియంత్రణలో ఉండరాదని, టీవీ ప్రసారాల ప్రభుత్వం కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయనే వాదన వినిపిస్తున్నారు...

ముఖ్యమంత్రిగా ఉంటూ, సాక్షి పేపర్, టీవీ స్థాపించిన చరిత్ర కలిగిన పార్టీ, ఇలా వ్యవహరించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది... 150 రూపాయలు అంటే, పేదలు, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా దీంతో లబ్ది పొందే అవకాసం ఉంది... 500 పెట్టి ఇంటర్నెట్, 200 పెట్టి ఫోన్ రీచార్జ్, 200 పెట్టి కేబుల్/డిష్ పెట్టుకునే బదులు, పేదవారికి, 150 కే ఇవన్నీ వస్తాయి అని, వారికి వినోదంతో పాటు, విజ్ఞానం కూడా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్ నెట్ తీసుకువస్తే, ఈ జగన్ పార్టీ ఎమ్మెల్యే ఇది కూడా అడ్డుకునే ప్రయత్నం కోర్ట్ ల ద్వారా చేస్తున్నారు... రాజధాని లాగే, ఈ ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read