ఆకాశాన రివ్వున ఎగిరే యుద్ద విమానాలనే ఇంతవరకూ చూశాం. అందులో ఏయే భాగాలుంటాయి ? అవి ఎలా పని చేస్తాయి? క్లిష్ట పరిస్థితుల్లో అవి నిర్వర్తించే పాత్ర పమిటి ? శత్రు స్థావరాలపై దాడులెలా చేస్తాయన్నదాని పై పమాత్రం అవగాహన ఉండదు. విశాఖ ఆర్కే బీచ్లో టీయూ-42 యుద్ధ విమాన ప్రదర్శన ద్వారా ఆ పరిజ్ఞానం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది.
సాగర తీరంలో కొలువైన టీయూ -42 యుద్ధ విమానం డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే విమాన విడిభాగాల అమరిక, రంగులు వేయడం, కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. విమానం లోపలికి ప్రవేశించే మార్గం కూడా ఏర్పాటైంది. లోపల విద్యుత్తు కాంతుల పనులు కొలిక్కి వచ్చాయి. మిగిలిన హంగులను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. గ్రానైట్ ఫ్లూరింగ్ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో రన్ వే, చుట్టు పక్కల పచ్చదనం ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి.
టీయూ 142 యుద్ధ విమానాన్ని సాధారణ విమానం మాదిరిగా సందర్శించేందుకు వీలుపడదు. దీన్ని పూర్తిగా సందర్మించాలన్నా సంపూర్ణంగా తెలుసుకోవాలన్నా లోనికి ప్రవేశించి వీక్షించాలి. విమానంలోనికి వెళ్లడానికి అవసరమైన దారి ఇప్పటి వరకు లేదు. ప్రవేశించడానికి, తిరిగి బయటకు రావడానికి కూడా రెండు మార్గాలు అవసరమయ్యాయి. ఇంజినీర్లు విమానం కాక్పిట్ వద్ద ప్రధాన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. మరో మార్గాన్ని విమానం వెనుక భాగంలోని రెక్క దిగువన ఏర్పాటు చేయనున్నారు.