పరిటాల రవి... అది ఒక విప్లవం.... ఆ పేరు ఒక భరోసా... ఆ పేరు వింటే అక్రమార్కులకు హడల్... అలాంటి పరిటాల రవితో, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా సన్నిహితంగా ఉండేవారు... కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉండగా, పరిటాల రవితో మంచి సంబంధాలు ఉండేవి...

రవి అస్తమించిన తరువాత కూడా, పరిటాల కుటుంబంతో, కేసీఆర్ కు సంబంధాలు కొనసాగుతున్నాయి... ఆ సన్నిహితంతోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహానికి, స్వయంగా ఆహ్వానించారు...

ఇలాంటి పిలుపులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, రొటీన్ గా జరిగివే అయినా, కేసీఆర్ మాత్రం పరిటాల కుటుంబం మీద ఉన్న అభిమానంతో, పరిటాల శ్రీరామ్‌ వివాహానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు... దీనికి సంబంధించి తెలంగాణా సియంఓ అధికారాలు, బద్రతా ఏర్పాట్లు పై ఆంధ్రప్రదేశ్ డిజిపితో చర్చించారు.. కేసీఆర్‌ అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం 11.30కి హైదరాబాద్‌లో విమానంలో బయల్దేరి పుట్టపర్తి విమానాశ్రయంలో దిగి, వెంకటాపురం చేరుకుని వధూవరులను ఆశీర్వదిస్తారు. మాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తున్నారు కాబట్టి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అవకాశం ఉంది.

మరో పక్క, పరిటాల వారి ఇంట వివాహ మహోత్సావానికి పోలీసులు దాదాపు 1700 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ పర్యవేక్షణలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 16 మంది డీఎస్పీలు, 29 మంది సీఐలు, 94 మంది ఎస్‌ఐలు, 166 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 568 మంది కానిస్టేబుళ్లు, 90 మంది మహిళా కానిస్టేబుళ్లు, 350 మంది హోంగార్డులు, ఆరు స్పెషల్‌ పార్టీ బలగాలతోపాటు ఏఆర్‌ విభాగం నుంచి నలుగురు డీఎస్పీలు, ఆరుగురు ఆర్‌ఐలు, 26 మంది ఆర్‌ఎ్‌సఐలు, వంద మంది ఏఆర్‌ఎ్‌సఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 మంది కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు కేటాయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read