పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి, టిపిడి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాజకీయంగా చంద్రబాబు చేసిన తప్పులు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల ఇంటింటా టిడిపి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజియనాగరం జిల్లా పర్యటన సందర్భంగా, నారా లోకేష్ అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. శృంగవరపుకోట సిట్టింగ్ ఎమ్మెల్యే లలితా కుమారి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
ప్రస్తుతం శృంగవరపుకోటలో MLA లలితా కుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి, నియోజకవర్గంలో ఐదు మండలాల్లో బలంగా ఉన్నాయి. ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సీట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయింది. జిల్లా మంత్రులకు ఈ సమస్య పరిష్కరించమని చెప్పినా, ఎవరూ దానిని పరిష్కరించలేరు. చివరకు లోకేష్ అడుగుపెట్టి, ఎమ్మెల్యే లలితకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ప్రకటనతో హైమావతి, ఆమె అనుచరులు కలత చెందాయి.
రాజకీయ విశ్లేషాకులు ఇది మంచి నిర్ణయం అని చెప్తున్నారు. లోకేష్ తెలివైన చర్యగా అభివర్ణించారు. ముసుకులో గోద్దులాట లేకుండా, ఎలక్షన్స్ దాకా సాగాదియ్యకుండా లోకేష్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ క్లారిటీ వస్తుంది అని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని, హైమావతిని బుజ్జగించటం పెద్ద సమస్య కాదంటున్నారు... నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుతో, మంచి ఊపులో ఉండగా అసంతృప్తులు వేరే పార్టీలోకి వెళ్ళే సాహసం చెయ్యరు...
వాస్తవానికి, చంద్రబాబు నాయుడు అటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవటానికి చాలా ఆలస్యం చేస్తారు. అటు కర్ర విరగక, ఇటు పాము చావక, ఎవరు పని చెయ్యాలో తెలీక, అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా అసహనానికి లోనయ్యేవారు.. చివరికి పార్టీకి నష్టం జరిగిదే... ఇలా సాగదీసే విషయంలో చంద్రబాబు మీద చాలా అపవాదు ఉండేది... కానీ లోకేష్ అలా సాగదియ్యకుండా, బోల్డ్ స్టెప్ తీసుకుని, కచ్చితమైన అభిప్రాయం చెప్పేశారు. రాజకీయంగా చంద్రబాబు చేసిన తప్పులు నుంచి, లోకేష్ పాఠాలు నేర్చుకుంటున్నాడు అంటున్నారు విశ్లేషకులు... అన్ని నియోజకవర్గాల్లో ఈ క్లారిటీ ఇచ్చేస్తే, ఎవరి పని వారు చేసుకుంటూ, ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవచ్చు అంటున్నారు.