కావేరి పుష్కరాలు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యాయి... 24 వరకు జరిగాయి.... తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పుష్కరాలు జరిగాయి... నిజానికి గంగా నది తరువాత, కావేరి నదికి అధిక ప్రాదాన్యత ఉంటుంది... కాని అసలు పుష్కరాలు జరుగుతున్నాయి అని కూడా చాలా మందికి తెలీదు.. ఇక అక్కడికి వెళ్ళిన వారు, ఆ వసతలు చూసి, నరకాన్ని అనుభవించాం అని చెప్తున్నారు... రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అసలు పుష్కరాలు గురించే పట్టించోకోలేదు... ప్రభుత్వం తరుపున సరైన ఏర్పాట్లు లేవు... ఎదో కొన్ని ధార్మిక సంస్థలు పూనుకుని కొన్ని ఏర్పాట్లు మాత్రం చేసాయి... తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు, ఇలాగనే హిందూమత విశ్వాసాలను కాపాడేది అని ధార్మిక సంస్థలు అంటున్నాయి...
కృష్ణా, గోదావరి పుష్కరాలు చూసిన ప్రజలు, కావేరి పుష్కరాలకు వెళ్లి వచ్చి, అక్కడి ప్రభుత్వాలకి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా చెప్తున్నారు... అక్కడి ప్రభుత్వాలు, ఏర్పాట్లు చేయటంలో ఘోరంగా విఫలం అయ్యాయని ప్రజలు అంటున్నారు... ఒక ఆధాత్మిక భావమే కలగలేదు అని అంటున్నారు....
ఒక పక్క చంద్రబాబు వరుసుగా కృష్ణా, గోదావరి పుష్కరాలు కనీ వినీ ఎరుగని రీతిలో చేశారు... రాష్ట్రంలో అందరినీ భాగస్వామ్యం చేశారు... నదులకి నిత్య హారతి ఇచ్చే కార్యక్రమాన్ని పుష్కరాలతో మొదలు పెట్టారు... నదుల పట్ల ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేశారు... ప్రతి రోజు, ఎదో ఒక విషయం తీసుకుని ప్రజల చేత ప్రతిజ్ఞ చేపించే వారు... ప్రజలను అన్నిట్లో భాగస్వామ్యం చేసి, బాధ్యత పెంచేలా పుష్కరాలు ఉపయోగించుకున్నారు... ఇప్పటికీ, కృష్ణా హారతి చూడటానికి, కొన్ని వేల మంది పవిత్ర సంగమం దగ్గరకు వస్తున్నారు...
ఇక కృష్ణా, గోదావరి పుష్కర ఏర్పాట్లు గురించి అయితే చెప్పనే అవసరం లేదు అంటూ గుర్తు చేసుకుంటున్నారు... ఘాట్ల పరిశుభ్రత, భక్తులకు సౌకర్యాలు, అన్నదానాలు, రవాణా, ఇలా అన్నిట్లో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని, అన్ని స్వచ్ఛంద సేవా సమితులతో కలిసి, పుష్కరాలకు వచ్చిన భక్తులకు జీవితాంతం గుర్తిండి పోయేలా చంద్రబాబు ఏర్పాట్లు చేశారని గుర్తు తెచ్చుకుంటున్నారు.... చంద్రబాబు అర్ధరాత్రి ఘట్లలో ఆకస్మిక పర్యటనలు చేసి, భక్తులకి అసౌకర్యం కలగకుండా చేసిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామికి, కంటే మన ముఖ్యమంత్రి కొన్ని వేల రెట్లు సమర్ధవంతుడు అని, ఈ సందర్భంగా మరో సారి చంద్రబాబు పరిపాలన దక్షతను గుర్తు చేసుకుంటున్నారు...