మావోయిస్టు మాజీ నేత, చంద్రబాబు మీద అలిపిరిలో దాడి చేసిన నిందితుడు, సుదర్శన్‌ ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుజరాత్‌ తరలించారు.

6౦ ఏళ్ల సుదర్శన్ తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెంది న వారు. దక్షిణ గుజరాత్‌లో నక్సల్స్ కా ర్యకలాపాల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిం చారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2010లో ఆయనపై సూరత్ జిల్లాలో దీనికి సంబంధించి కేసులు న మోదయ్యాయి.

2003లో చంద్రబాబు పై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయినా, ఒడిషా లో జిల్లా కలెక్టర్‌ను అపహరించుకుని పోయిన క్సలైట్లు పెట్టిన షరతుల క్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్‌ను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇతనికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలో కూడా భాగస్వామ్యం ఉంది...

అయితే ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ, తన మీద జరిగిన దాడి రాజకీయ కోణంలో జరిగింది అని, రాజశేఖర్ రెడ్డి, గంగి రెడ్డి సంబంధాన్ని ఉదాహరించారు... మరి ఇప్పుడు సుదర్శన్, చంద్రబాబు మీద జరిగిన దాడి పై, ఎవరు దాని వెనక ఉన్నారు, ఎవరు కుట్ర చేశారు, లాంటి కొత్త విషయాలు చెప్తారేమో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read