రాష్ట్ర విభజన తర్వాత ఈ రోజు రాష్ట్రం ఈ స్థాయికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు అనేది అందరికి తెలిసిన విషయమే... తన అనుభవంతో ముందు నుంచి అన్ని తానై నడిపిస్తూ మంత్రులకు శాఖలు కేటాయించినా వారి పని కూడా చంద్రబాబే చూస్తూ కష్టపడుతూ వస్తున్నారు... పరిశ్రమలు , విద్యుత్, సాగు నీటి ప్రాజెక్టులు ఇలా ప్రతి ఒక్కటి చంద్రబాబు కనుసన్నల్లో జరిగినవే...

అయితే ఇక్కడ మంత్రుల పని తీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అన్నది వాస్తవం... ప్రతి పనిని చంద్రబాబు పర్యవేక్షించకపోతే ఏ ఒక్కటి ముందుకు సాగదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది... పోనీ చంద్రబాబు చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వారు ఏమైనా కృషి చేస్తున్నారా అంటే అది కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి... మీరు ఎలాగో చెయ్యరు చేసింది అన్నా చెప్పుకొండి అంటే దాంట్లో కూడా చాలా మంది మంత్రులు వెనుకబడే ఉన్నారు...

ఏ విషయంలో అయిన, మంత్రులు ఉన్నా సరే, వారికి ప్రతి ఒక్కటి చంద్రబాబు చెప్తే మినహా ముందుకు జరగని పని.. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్టు తెలుస్తుంది.. ఎదుటి వాడిని చూసి అయినా మారాలి అనుకున్నారో ఏమో తెలియదు కాని, వారంతట వారే చంద్రబాబు కి సహకరిస్తూ చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారట... చంద్రబాబుని మెప్పిస్తే తమ పదవి ఉంటుందనుకుంటున్నారో ఏమో తెలియదు గాని బాగానే కష్టపడుతున్నారని వినికిడి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read