ఎంతటి వారైనా క్రమశిక్షణతో ఉండాలి... ఇది ఎప్పుడూ చంద్రబాబు చెప్పే మాట... పార్టీ పరంగా కూడా, ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, ముందు చంద్రబాబు చెప్పే మాట ఇదే... క్రమశిక్షణ...
కాని ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో, నేతలు క్రమశిక్షణ తప్పారు.. పార్టీ నిర్ణయాలని దిక్కరించారు... కొంత మంది అధినేత మాట కూడా లెక్క చెయ్యకుండా ప్రవర్తించారు...కొంత మంది, విమర్శలు చేశారు కూడా... కాని, చంద్రబాబు చర్యలు తీసుకోలేదు... వార్నింగ్ లు తోనే సరి పెట్టారు... మారటానికి టైం ఇచ్చారు.. ఇదే చాలా మంది నాయకులకి అలుసు అయ్యింది... మనం ఏమి చేసినా, చంద్రబాబు ఏమి చెయ్యడు లే అనే ధీమా వచ్చేసింది...
ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీల పేరుతో చిన్న శాంపిల్ చూపించారు... మీ వైఖరి ఇలాగే కొనసాగితే, పార్టీ తరుపున 2019 టికెట్ ఇచ్చేది లేదు, అనే సంకేతం పంపించారు... క్రమశిక్షణ తప్పితే, తోక కత్తిరిస్తాను అనే పరోక్ష సంకేతాలు పంపారు...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీల విషయంలో సీనియర్లు అని చూడలేదు, తనకు కావాల్సిన వారు అని చూడలేదు... ఎవరైతే తోక జాడించారో వాళ్ళకి చెక్ పెట్టారు చంద్రబాబు...
చంద్రబాబు ప్రాణ స్నేహితుడు బొజ్జల, అలాగే చంద్రబాబుకి బాగా దగ్గరగా ఉన్న కరణం బలరాం లాంటి సీనియర్ నేతలకి కూడా రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వలేదు... అలాగే, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా తప్పించారు... మంత్రి పదవి ఇవ్వలేదు అని, కాపులు గొంతు కోశారు అంటూ హడావిడి చేసిన బొండా ఉమాని కూడా రాష్ట్ర కమిటీ నుంచి తప్పించారు... అలాగే విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా మంత్రి పదివి ఇవ్వలేదు అని, కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్లి హంగామా చేసి, హడావిడి చేసినందుకు, ఆయన కూడా రాష్ట్ర కమిటీ నుంచి అవుట్ అయ్యారు...
మొత్తానికి ఈ చర్యతో, చంద్రబాబు తన దగ్గర తోక జాడిస్తే, ఊరుకునేది లేదు అని గెట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది... దీంతో ఎమ్మల్యేలు కూడా అలెర్ట్ అయ్యారు... 2019 సీటు రావాలి అంటే, క్రమశిక్షణతో మెలగాలి అని, చంద్రబాబు చెప్పినవి అని చెయ్యాలి అని, ఆయన దృష్టిలో మార్కులు కొట్టేయేక పొతే, సీటు కూడా రాదు అని డిసైడ్ అయ్యి, పని చేస్తున్నారు...