నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో నేషనల్ మీడియాతో మాట్లాడారు.. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహాక కమిటీ ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబును చైర్మన్ అయినందున, నేషనల్ మీడియా దానికి సంభందించిన ప్రశ్నలు చంద్రబాబుని అడిగింది.

నోట్ల రద్దు మంచిదే అని, అయితే డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేసి, ఆన్లైన్ చార్జీలు తగ్గించి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే, నగదు రహితం వైపు ప్రజలు ఆకర్షితులు అవుతారని చంద్రబాబు అన్నారు...

నోట్ల రద్దు తర్వాత రెండు వేల నోటును ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ తప్పు చేశారా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ, పెద్ద ఎత్తున నోట్ల రద్దు చేసినప్పుడు, భారీ స్థాయిలో డబ్బు చలామణిలో నుంచి వెళ్లిపోయిందని, అందుకే ఆ సమయంలో రెండు వేల నోటు అవసరమైందని చెప్పారు.. అయితే ఇప్పుడు డిజిటల్ వైపు ప్రజలను సన్నద్ధం చేసి, అవసరమైన ఇంటర్నెట్ సామర్ధ్యం పెంచి, చార్జీలు తగ్గించి, కొత్తగా ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోట్లు రద్దు చెయ్యాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద నోట్లు రద్దు చెయ్యమంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు.. అయితే పెద్ద నోట్లు రద్దు తరువాత, వచ్చిన 2 వేల రూపాయల నోటు కూడా అవసరం లేదు అని చంద్రబాబు ముందు నుంచి చెప్తున్నారు.

ఏదైనా సంస్కరణ చేసినప్పుడు, ఫలితాలు రావాలంటే కొంత సమయం పడుతుందని, పెద్ద నోట్ల వల్ల అవినీతి ఎక్కువవుతుందని, దాన్ని నేను గట్టిగా నమ్ముతానని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read