చంద్రబాబు నాయుడు" ఇప్పుడు ఈ పేరు చెప్తే నీటి పారుదల శాఖలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులకు చుక్కలు కనపడుతున్నాయి... తనంతట తాను లక్ష్యాలను పెట్టుకుని ... అప్పటికి పూర్తి చేస్తా అని చెప్పి ఆయన నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా మాకు ఈ టార్చర్ ఏంటి అని చంద్రబాబు ని చూసి కొందరు అధికారులు తిట్టుకుంటున్నారట... ప్రాజెక్ట్ పూర్తి అయితే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారని గాని మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారట....
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అంటూ రైతులకు కొరకు పలు కార్యక్రమాలు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత పట్టుసీమ తో సాగునీటి ప్రాజెక్టులను మొదలు పెట్టారు... అక్కడి నుంచి రోజులో అధిక భాగం వాటి గురించి ఆరా తీస్తూ వారం వారం సమీక్షలు సమావేశాలు మొదలు పెట్టి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట... పోలవరం త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి వారంలో ఒక రోజు ఈ ప్రాజెక్టుకు కేటాయించారు..
పనులు ఎక్కడి వరకు వచ్చాయి గేట్లు పూర్తి అయ్యాయా..? డయాఫ్రామ్ వాల్ ఎక్కడి వరకు వచ్చింది... ఇలా అన్ని ఆరా తీస్తుండటంతో అధికారులకు నిద్ర కరువైపోతుందట... అలాగే రాయలసీమ విషయంలో కూడా సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి సీమలో పర్యటిస్తున్నారంటే అధికారులు తెలియకుండానే ప్రాజెక్టుల వద్దకు పరిగెడుతున్నారట... సర్వీస్ సగంలో ఉన్న అధికారులు దాదాపు 70 ఏళ్లకు దగ్గరగా ఉన్న చంద్రబాబు స్పీడ్ అందుకోలేక నానా అవస్థలు పడుతున్నారట...