చంద్రబాబు పడిన కష్టం ఫలిస్తుంది... CII సమ్మిట్ లో ఏమి సాధించారు అనే వారికి కూడా ఇది సమాధానం కానుంది. నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రతిష్టాత్మక అపోలో టైర్ల ప్లాంట్ ఏర్పాటు కానుంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని చిన్నపండూరు గ్రామంలో దీనిని స్థాపించనున్నారు. సెప్టెంబరు 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చేతుల మీదుగా అపోలో పరిశ్రమకు రహదారి నిర్మాణ పనులకు కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుతో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు పరిశ్రమల శాఖ సమ్మతించింది.
విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అపోలో టైర్ల కంపెనీ రాష్ట్రంలో తన ప్లాంటు స్థాపనకు పరిశ్రమల శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అపోలో పరిశ్రమకు 250 ఎకరాలను కేటాయించారు. ఏటా 30లక్షల టైర్లను ఇక్కడ తయారు చేస్తారు.
రూ.4025 కోట్లతో స్థాపించే ఈ ప్లాంటులో 14,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. తొలిదశలో రూ.550 కోట్లతో చేపట్టే ప్లాంట్‌లో 450 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది.