ప్రతి విషయంలోనూ, చంద్రబాబుతో పోటీ పడే కెసిఆర్... సంక్రాంతి… క్రిస్మస్… రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకాలు ఇస్తున్నట్టు, తానూ కూడా ఇద్దాం అని కొత్తగా ట్రై చేశారు... చంద్రన్న కానుకాల పేరుతో పండగలప్పుడు సరుకులు పంపిణీ చేసి, పేదవారు కూడా పండగ చేసుకోవాలనేది చంద్రబాబు ఉద్దేశం. అలా ఇస్తున్న కానుకలతో చంద్రబాబుకి ఆయా వర్గాల్లో మైలేజీ వచ్చింది.
బాబులాగా మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు కేసీఆర్... తెలంగాణలో ఆడపడుచులకు ఏకంగా చీరలు ఇచ్చి వారి దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుని బొక్క బోర్లా పడ్డారు కెసిఆర్.
తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడేదాకా విషయం వెళ్ళింది... బతుకమ్మ కానుకగా ఇస్తోన్న చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు చాలా చోట్ల నిరసనలు తెలిపారు... సూరత్ నుంచి తెచ్చిన, రూ.50, రూ.100 చీరలు ఇస్తారాఅంటూ మండిపడ్డారు. తమకు చేనేత చీరలే ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసి, ఒక్కసారి కట్టుకుంటేనే చిరిగిపోయే చీరలు ఇచ్చారని మహిళలు మండిపడ్డారు.
దీంతో చంద్రన్న కానుకలులాగా మంచి పేరు రాకపోగా, విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది... మహిళలు రోడ్డెక్కి చీరలు తగలుపెట్టెంత చెడ్డ పేరు వచ్చింది...