దేశంలో నర్మద ప్రాజెక్టు తరువాత జాతికి అంకితం చేసే ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సందర్శించారు. ప్రాజెక్టుపై విహంగ వీక్షణం నిర్వహించారు. అనంతరం పోలవరం పనులు పరిశీలించారు. స్పిల్‌వే నిర్మాణం, గేట్ల నిర్మాణం పనుల తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ మ్యాప్‌లను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే, స్పిల్ ఛానల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఐకాన్‌ బ్రిడ్జ్‌, పవర్‌హౌస్‌ నిర్మాణాలు త్వరలో చేపడతామని వెల్ల‌డించారు.

960 మెగావాట్ల పవర్‌హౌస్‌ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉండగా 70శాతం పని పూర్తి అయిందని తెలిపారు. 31 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.70లక్షల క్యూబిక్‌ మీటర్లు పని పూర్తి అయిందని వివరించారు.1200మీటర్ల డయాఫ్రంవాల్ 550 మీటర్లు పూర్తి చేశామని తెలిపారు.

7 లక్షల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే కాంక్రీట్ పనులు పూర్తి అయితే ప్రాజెక్టు ఓ రూపానికి వస్తుందని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 7 వేల కోట్ల రూపాయ‌లు పనులకు ఖర్చు చేశామని, మరో 5 వేల కోట్ల రూపాయ‌లు నిర్వాసితుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. మరో 40 వేల కోట్ల రూపాయ‌లు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమవుతుందని అంచ‌నా వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read