Sidebar

07
Wed, May

స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి అరుదైన గౌరవం దక్కింది. అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చెయ్యనున్నారు.

ఈ మేరకు, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ లో జాతీయ నాయకుల విగ్రాహాల ఏర్పాటు కమిటీ సభ్యుడు, కాకినాడ ఏంపీ తోట నర్సింహం ఈ విషయాన్ని దృవీకరించారు... తోట నర్సింహం , అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో లోక్‌సభ స్పీకర్‌కు లెటర్ పెట్టారు. ఆ విజ్ఞప్తికి అనుకూలంగా, విగ్రహం ఏర్పాటుకు అవకాశం లభించింది.

సంగ్రామ స్పూర్తిని దేశ నలు దిక్కుల్ల్లో రగిలించిన అల్లూరి చరిత్ర భావి తారలకు స్పూర్తిదాయకంగా ఉండాలన్న ఆకాంక్షతో, అలాంటి వ్యక్తి విగ్రహం పార్లమెంట్‌లో ఉండడం దేశానికే గర్వ కారణం.

త్వరలోనే రాష్ట్రం నుంచి విగ్రహం తాయారు చేసి, పార్లమెంట్ ఆవరణలో పెట్టనున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read