"బ్లాక్ చైన్ టెక్నాలజీ"... ఎంత మందికి ఈ టెక్నాలజీ గురించి తెలుసు ? దేశంలో, ఇంకా చెప్పాలి అంటే, ప్రపంచంలోని చాలా కార్పొరేట్ కంపనీలకు కూడా, ఈ టెక్నాలజీ గురించి సరిగ్గా తెలీదు... అలాంటిది, మన దేశంలో మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఈ టెక్నాలజీలోని ఉపయోగాలు గుర్తించి, దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు... సైబర్ క్రైమ్ లు బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో దానికి విరుగుడు ఈ "బ్లాక్ చైన్ టెక్నాలజీ"....

అలాంటి "బ్లాక్ చైన్ టెక్నాలజీ" మీద, అతి పెద్ద బ్లాక్ చైన్ సదస్సు మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ సదస్సుకి 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు తరువాత, చలా వేగంగా టెక్నాలజీలో మార్పులు రానున్నాయి. సైబర్ ముప్పులను ఎదుర్కోవటం, సమాచారాన్ని వంద శాతం సురక్షితంగా ఉంచగల సామర్ధ్యం, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీది.

ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థల సిఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవని మెచ్చుకున్నారు... నిజానికి ఇలాంటి సదస్సులు కార్పొరేట్ వరల్డ్ లోనే జరుగుతూ ఉంటాయి... అలాంటిది, ఈ సైబర్ ముప్పుని పసిగట్టి, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి పూనుకుని ముందుకు రావటం చూస్తుంటే, చంద్రబాబు ముఖ్యమంత్రా, లేక ఐటి కంపెనీ సిఈఓనా, అంటూ, చంద్రబాబు విజన్ చూసి ఆశ్చర్యపోతున్నారు అక్కడ ప్రతినిధులు...

ఇది ఇలా ఉండగానే, చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ వారిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది... ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ వినియోగం పై బ్లాక్ చైన్ సెమినార్ లో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఈ -ప్రగతి ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ అందించగలుగుతున్నారు. కోర్ డాష్ బోర్డును సీఎం లైవ్‌లో చూపించారు. రైతులకు మేలు చేసేలా భూసార పరీక్షలకు రియల్ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ని వివిధ రంగాల్లో ఉపయోగించే దేశం లో ఏ రాష్ట్రంలో లేని యూజ్ కేస్ హబ్ తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా, విశాఖను మార్చాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మొత్తానికి చంద్రబాబు స్పీచ్, ప్రజెంటేషన్ చూసి, 25 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆశ్చర్యపోయారు... టెక్నాలజీ పట్ల చంద్రబాబుకి ఉన్న నాలెడ్జ్, ఆ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలనే తపన, అద్భుతం అంటూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు... చంద్రబాబు కోరుకునట్టు, అన్ని రకాల సహకారాలు అందిస్తామన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read