చుక్క నీరు... కనీసం ఒక చుక్క నీరు కూడా ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా ప్రవాహం రాలేదు... వాస్తావాలను నమ్మాలి.. ఊహాగానాలకు తావులేదు... ఖరీఫ్ సీజను అర్ధభాగం అయిపోవచ్చింది.... శ్రీశైలం నుంచి నీరు వస్తోందా .. నాగార్జున సాగర్ దాటి కృష్ణ నీళ్లు రావాలంటే నవంబరు దాటినా కష్టమే... రైతులు ఖరీఫ్ వేసుకునే పరిస్థితి ఉండేది కాదు... అక్టోబర్ నెల వస్తుంది... కాని కృష్ణా డెల్టా మొత్తం, చివరగా ఉన్న దివిసీమ దాకా చూసి రండి... ప్రతి ఎకరం ఎంత పచ్చగా ఉందో కనపడుతుంది... కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం కనపడదు... ఎర్రని గోదారామ్మ పారుతుంది.... గత ఏడాది ఖరీఫ్ పండిందంటే, ఈ ఏడాది జూన్ లోనే కోస్తా రైతులు 11 లక్ష ఎకరాల్లో నాట్లు వేసుకుని మరో రెండు నెలల్లో పంటను అందుకోనున్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టమే... ఆయన విజన్ ..రైతులకు మేలు చేయాలన్న దూరదృష్టి... నేడు కోస్తాలోని లక్షలాది రైతులు ఆనందంగా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలకు ధాన్యం పండించి అందించనున్నారంటే చంద్రబాబు కృషిని అభినందించాలసిందే .. ఇదంతా చంద్రబాబు ముందు చూపు వల్ల పట్టిసీమతో సాధ్యమైంది... ఇలాంటి పట్టిసీమనా జగన్ వ్యతిరేకించేది అంటారు ఎవరైనా...
కృష్ణా డెల్టా రైతులకి ప్రత్యక్ష దైవం ఈ పట్టిసీమ... అలాంటి పట్టిసీం ప్రవాహం ఈ సంవత్సరం నిరాటంకంగా 100 రోజులు నుంచి పారుతూనే ఉంది... గత 20 ఏళ్ళు నుంచి ఎప్పుడూ లేనట్టుగా, ఈ ఏడాది ముందస్తుగానే నీరు విడుదల చేయడంతో, కృష్ణాడెల్టాలో జూన్ నెలలోనే ఖరీఫ్ సాగు మొదలైంది. మరో నెల రెండు నెలల్లో, రెండో పంట కూడా వేస్తున్నారు...
గత మూడు సంవత్సరాల నుంచి, పట్టిసీమ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఎలాంటి ఆటంకాల్లేకుండా పూర్తి స్థాయిలో అక్కరకు రావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. దీనిని పురస్కరించుకుని రైతాంగం పలుచోట్ల సంబరాలు సైతం నిర్వహించింది. 2015లో మొదటి ఏడాది, 89 రోజుల పాటు 8.3 టీఎంసీల నీటిని తీసుకొచ్చారు.. రెండో ఏడాది , 138 రోజుల పాటు 55.65 టీఎంసీల నీరు మళ్ళించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 100 రోజులకి, 64 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి చేరింది. మరో రెండు నెలలు ఈ ప్రవాహం కొనసాగనుంది.
ఇప్పటి వరకు కృష్ణా డెల్టాలో 10.80 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యయి... గోదావరి నీరే కావడంతో పైరు ఏపుగా పెరిగింది...
రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే రోజులు పోయాయి.. అటువంటి రాజకీయ నేతలకు ఆంధ్రప్రదేశ్ లో ఇక స్థానం ఉంటుందని భావించడం లేదు... పార్టీలు, కులాలు, మతాలూ, వర్గాలు, ప్రాంతాలను రెచ్చ్చగొట్టి పబ్బం గడుపుకునే నేతలు చంద్రబాబు స్థానాన్ని అందుకోవడం కాదుకదా ఆయన్ను విమర్షించే హోదా కూడా రాదు... ప్రజలు ఒప్పుకోరు...