విభజన తరువాత పెట్టుబడులను ఆకర్షిస్తానికి చంద్రబాబు అనేక కష్టాలు పడ్డారు... ఇప్పుడిప్పుడే అవి ఫలితాలను ఇస్తున్నాయి... చిన్న తరహా ప్రాజెక్ట్ లను ఆకర్షించటం కోసం, ప్రతి జిల్లలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేశారు... అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, చిన్న తరహా పరిశ్రమలకి అక్కడ కంపెనీ పెట్టటానికి తగిన భూమి ఇవ్వనున్నారు...
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా, ముందుగా కృష్ణా జిల్లాలోని వీరపనేనిగూడెం దగ్గర ఏర్పాటు చేసిన ఇండస్ర్టియల్ కారిడార్ రెడీ అయ్యింది... హైదరాబాద్ లో ఇప్పటికే ప్లాంట్లు కలిగి, విస్తరణ కోసం అమరావతి వైపు చూస్తున్న 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ఇండస్ర్టియల్ కారిడార్ లో తమ కార్యకలాపాలు జరపనున్నాయి.
ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తయ్యి, అక్కడ ప్లాంట్లు కూడా నెలకొల్పారు... ఈ విజయదశమి రోజు, వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్ కారిడార్ లో 75 పరిశ్రమలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రరంభించనున్నారు. ఈ 75 కంపెనీల ద్వారా, దాదాపు 2,600 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ పరిశ్రమల్లో ఎరోస్పేస్ పరికరాలు, మిషనరీ విడిభాగాలు, ప్రెస్ టూల్స్, కాప్టివ్ ఎక్వి్‌పమెంట్, గృహోపకరణాలు, ఇంజనీరింగ్ సేవలు లభిస్తాయి.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి అధికారులని ఆదేశించి, ఆ దిశగా అడుగులు వెయ్యమన్నారు.