రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీనుండి 26వ తేదీ వరకూ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 17వ తేదీన బయల్దేరి అమెరికా పర్యటనకు వెత్తారు. అక్కడి 18-20 తేదీల మధ్య అయోవా అంతర్జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ ఆహార ధరల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అయోవా విశ్వవిద్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొల్పనున్న అయోవా అంతర్జాతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రానికి 9న శంకుస్థాపన చేయనున్న సిఎం చంద్రబాబు, అనంతరం అక్కడి వ్యవసాయ విధానం, అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో సాధిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల పై అధ్యయనం చేయనున్నారు.
అనంతరం సిఎం అరబ్ దేశాలలోనూ పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతిలో నిర్మించబోయే పరిపాలన, అసెంబ్లీ హైకోర్టు భవనాల ఆకృతులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే వీలుంది. అలాగే సీఆర్డిఏ ఉన్నతాధికారుతులతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయనణతో కలిసి లండన్లో 24-25 తేదీల్లో పర్యటించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వీరితోపాటు ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట విదేశీ పర్యటకు వెళ్లే వారిలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస సిఈఓ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి లేదా వ్యక్తి గత సహాయకుడు ఉండే అవకాశాలున్నాయి. సిఎం తిరిగి రాష్ట్రానికి ఈ నెల 27వ తేదీ వచ్చే అవకాశాలున్నాయి.