పేదల కోసం కాన్సర్ చికిత్స చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ఖరీదైన కాన్సర్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఒక్కసారి కాన్సర్ వ్యాధి వచ్చింది అంటే, ట్రీట్మెంట్ కోసం 4-5 లక్షలు ఖర్చు అవుతుంది... అంత డబ్బు పెట్టుకోలేక, చాలా మంది పేదలు అలాగే ఆ బాధ అనుభవిస్తున్నారు... ఇవన్నీ చుసిన చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా కాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్నూలులో రాష్ట్ర స్థాయి పెద్దాసుపత్రి, నెలూరులో ప్రాంతీయ ఆసుపత్రి రాబోతున్నాయి. తిరుపతిలో కాన్సర్ ఆసుపత్రి.. పరిశోధన సంస్థ టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్నాయి. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో నాట్కో సహకారంతో కాన్సర్ వైద్య సేవల భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతు న్నాయి.

తిరుపతిలో ఇప్పటికే ఉన్న స్విమ్స్ రుయా, బర్డ్ ఆసుపత్రుల తరహాలోనే కాన్సర్ ఆసుపత్రి రాబోతోంది. టాటా ట్రస్ట్ ఆధ్వ ర్యంలో అలిమేలు చారిటబుల్ ఫౌండేషన్ దీనిని నిర్మించనున్నాయి. రూ.140 కోట్ల వరకు ఈ ఆసుపత్రికి వ్యయం చేయనున్నారు. ఇందులో ట్రస్తు రూ.100 కోట్ల వరకు వ్యయం చేయనుంది. మిగిలిన డబ్బును దాతల నుంచి సేకరించనున్నారు. అమెరికాకు చెందిన ఓ భక్తుడు రూ.33 కోట్లు, మరో భక్తుడు రూ.7 కోట్లను అందించేందుకు ఇప్పటికే ముందుకొ చ్చారు. టాటా ట్రస్తు ద్వారా నిర్మించే ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు సామాన్యులకు ఉపశమనాన్ని కలిగించనున్నాయి.

వీటితో పాటు హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ అమరావతి పరిధిలో ఓ శాఖను ఏర్పాటు చేయనుంది. వైజాగ్ లో ఇప్పటికే హోమీబాబా కాన్సర్ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం ద్వారా వైద్య సేవలు తక్కువ రుసుముతో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో భారీగా కాన్సర్ చికిత్సా కేంద్రాలు రాబోతున్నందున మధ్య తరగతి, పేద కుటుంబాలకు ఉపశమనం లభించనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read