రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా భావిస్తున్న హైపర్‌ లూప్‌ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించే అవకాశాలున్నాయి. కొన్నినెలలుగా తర్జనభర్జనలు పడిన అనంతరం అమరావతి రాజధానికి రవాణా మార్గాలను అనుసంధానం చేసేందుకు హైపర్‌ లూప్‌ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కదలిక ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్హహణ సంస్థ అయిన మెట్రోలైన్ కార్యాచరణ ప్రారంభించింది. సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ పరిశీలించిన అనంతరమే ఆర్ధిక సహాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నది.

అత్యాధునిక రవాణా వ్యవస్థ హైపర్‌ లూప్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆసక్తితో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వ్యవహారాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెకు బాధ్యతను తాత్కాలికంగా మెట్రోరైలు యాజమాన్యానికి అప్పగించడం జరిగింది. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన హైపర్‌ లూప్‌ సంస్థతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల పై, అమలు తీరు పై అధ్యయనం ప్రారంభించారు.

రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు, ఇప్పుడు ఉన్న రవాణా వ్యవస్థల పై లోతుగా పరిశీలిస్తున్నారు, దూర ప్రాంతాల మధ్య అనుసంధానం ఉండేలా హైపర్‌ లూప్‌ ను రాష్ట్రంలో ప్రారంభించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్ట్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించడంతో, ఈ ప్రాజెక్ట్ లో కదలిక ఏర్పడింది. దీనికి సంబంధించిన ప్రాధమిక అధ్యయనాన్ని అమెరికన్ ప్రతినిధులు ప్రారంభించిన నేపథ్యంలో అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వ యంత్రాం గం సిద్దమైంది.

హైపర్‌ లూప్‌ సంస్థ, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నాలుగు దఫాలుగా కలిసి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా అమరావతిలో హైపర్‌ లూప్‌ ప్రాజెక్ట్ అనుకూలమైన అంశమే అనే అభిప్రాయానికి ఆ సంస్థ రావడం జరిగింది.

అమరావతి రాజధాని నిర్మాణంలో నాణ్యతకు, ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న క్రమంలోనే ముఖ్యమంత్రి తాజాగా హైపర్‌ లూప్‌ ప్రాజెక్ట్ పై దృష్టిసారించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read