గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ఇప్పుడు ఢిల్లీలో కీలక బాధ్యతలు వచ్చాయి... పార్లమెంట్ స్టాండింగ్ కమిటిలో మెంబర్‌గా, కేంద్ర రక్షణ శాఖ స్టాండింగ్ కమిటి మెంబర్‌గా గల్లా జయదేవ్ నియమితులు అయ్యారు... వీటితో పాటు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన పార్టీ సెంట్రల్ కమిటీలో జయదేవ్ కు, అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు...
ఈ నియామకం వెనుక చంద్రబాబు వ్యూహం ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు... గల్లా జయదేవ్ కు ఢిల్లీ సర్కిల్స్ లో మంచి పేరు ఉంది... లోక్‌సభలో చర్చల్లో కూడా చాలా సమర్ధవంతంగా మాట్లాడుతూ, టీడీపీకి మంచి పేరు తీసుకువచ్చేవారు.. అంతే కాకుండా, కేంద్రంలోని బీజేపి పెద్దలతో, కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి.. బిజినెస్‌మెన్‌గా ఆయనకు వివిధ రంగాలపై స్పష్టమైన అవగాహన కూడా ఉంది.
వీటన్నిటినీ గుర్తించి చంద్రబాబు, జయదేవ్ కు కీలకమైన పదవి ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జయదేవ్ సమర్ధత ఉపయోగపడుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు... ముఖ్యంగా, రాజధాని, పోలవరం విషయంలో నిధులతో పాటు, మిగిలిన అనుమతులు సంపాడించటంలో జయదేవ్ అవసరం ఎంతో ఉందని నాయకత్వం భావిస్తుంది.