ఎవరైనా పెద్ద హోదా ఉన్నవారు ఎదురు పడినప్పుడో, లేక వయసులో పెద్దవారు ఎదురు పడినప్పుడో, గౌరవ సూచికంగా కొంచెం ముందుకు వంగి అభివాదం చేస్తూ ఉంటాం.... చాలా సందర్భాల్లో ప్రధాని, రాష్ట్రపతి, అద్వాని లాంటి పెద్దవాళ్ళని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇలానే అభివాదం చేసేవారు...

అయితే రాష్ట్రంలో ప్రజా సమస్యలు మీద పోరాడటం చేత కాని జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్, నెల జీతానికి పని చేసే జీతగాళ్ళు, అద్దె మైక్ పట్టుకుని, చంద్రబాబు లొంగిపోయాడు అని, కేసులు మాఫీ చేపించుకుంటున్నాడు అని, భయపడి పోతున్నాడని, ఇలా సునకనందం పొందుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు తీసే పనిలో ఉండేవారు... కెసిఆర్ అంటే చంద్రబాబుకి భయం అని, గ్రాఫిక్స్ పోస్ట్ లు పెట్టుకుని, సోషల్ మీడియాలో పిచ్చి ప్రపంచంలో ఉండేవారు...

అయితే ఇవాళ, పరిటాల రవి కుమారుడు, శ్రీరాం పెళ్ళికి, కెసిఆర్ అనంతపురం వచ్చారు... ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, పెళ్ళికి హాజరయ్యారు... ఇద్దరు ఎదురు పడినప్పుడు, కెసిఆర్ ముందుకు వంగి, గౌరవ సూచికంగా చంద్రబాబుకి అభివాదం చేశారు... చంద్రబాబు కూడా కెసిఆర్ చెయ్య పట్టుకుని పలకరించారు...

మరి జగన్ బ్యాచ్, అలాగే కొంత మంది తెలంగాణా మేధావాలు ప్రకారం, కెసిఆర్, చంద్రబాబుని చూసి భయపడుతున్నారా ? గౌరవ సూచికంగా అభివాదం చేసే దాన్ని కూడా, సునకానందం పొందే మీకు ఇలాంటివి కనిపించవా ?

గౌరవం అంటే ఏంటో తెలుసుకోండి... అయినా మనం ఇంట్లో తండ్రినే కొట్టిన మహానుభావుడి ఫాలోవర్స్ కదా, ఇలాంటివి తెలియవులే ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read