జగన్.. బీజేపీతో పార్టీకి లొంగిపోయాడు అని అందరికీ తెలిసిన విషయమే... అయితే నంద్యాల ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చి ఉంటే, ఈ పాటికి రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేది...

జగన్ తన కేసులు రాజీ కోసం, ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ తీసుకుని చర్చించటం, తరువాత ప్రత్యేక హోదా విషయం అస్సలు పట్టించుకోకపోవటంతో, జగన్ పూర్తిగా లొంగిపోయాడు అని ప్రజలకి అర్ధమైపోయింది... BJP పార్టీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఎదగటానికి, జగన్ ను కలుపుకోవాలని, జగన్ పార్టీ BJPలో విలీనం చేస్తే, కేసులు ఎత్తేస్తాం అని ఒప్పందం అయినట్టు వార్తలు వచ్చాయి.... నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు తరువాత, ఈ వార్తలకి కామా పడింది...

అయితే ఈ ప్రయత్నాలు మళ్ళీ మొదలు అయ్యాయి... ఈసారి ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్న జగన్, బీజేపీలో పార్టీని విలీనం చేసి, కేసులు కొట్టేయించుకోవటానికి కూడా వెనకాడట లేదు... లండన్ నుంచి వచ్చిన తరువాత ప్రజలకి తన మొఖం ఇప్పటి వరకు చూపించంలేదు.... కోర్ట్ కి తప్ప, లోటస్ పాండ్ దాటి రాలేదు... అయితే, దుర్గాష్టమి రోజున, భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా వ్యక్తిగత వాహనంలో జగన్ రెండు గంటలు బయటకు వెళ్లారు...

దుర్గాష్టమి రోజునే మాట్లాడుకుందాం రమ్మని, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీకి చెందిన ముఖ్యులు చెప్పటంతో, జగన్ ఆ రోజు వెళ్లి వారిని కలిసారనే ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ కుమారుడు ఇంటిలో ఈ చర్చలు జరిగాయి.

ఈ మొత్తం ప్రక్రియలో, విలీనమా, పొత్తా అన్నదే సస్పెన్స్... పొత్తుతో బీజేపికి వచ్చే లాభం ఏమి ఉండదు కాబాట్టి, దాదపుగా విలీనం అనే వార్తలు వస్తున్నాయి. నీకేంటి, నాకేంటి అనే లెక్కలు నడుస్తున్నాయి... జగన్ వైపు నుంచి ముఖ్యంగా కేసులు మాఫీ అయితే, బీజేపి వైపు నుంచి విలీనం అనే ప్రాధమిక ఒప్పందం జరిగినట్టు సమాచారం...

తన పాదయాత్రకు ఆటంకాలు లేకుండా కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేలా చేస్తే, ఏమి చెప్తే అది చేస్తానని, జగన్ వారితో చెప్పారని సమాచారం... జగన్ అంతరంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నేతలు, ఢిల్లీ చేరవేశారు, మరి రిజల్ట్ ఏంటో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read