అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... మై బ్రిక్, మై అమరావతి అంటూ, 10 రూపాయలు పెట్టి ఇటుకలు కొనమని, తద్వారా ప్రజా రాజధానిలో భాగస్వామ్యం కావలి అని పిలుపిచ్చినా, దాని మీద కూడా పడి ఏడ్చిన సందర్భం చూసాం...
ఇలాంటి వాళ్ళ అందరూ, ఈ చిన్న బాబుని చూసి సిగ్గు తెచ్చుకోవాలి... చిన్న వయసులో కూడా, పెద్ద మనుసుతో, తన పుట్టిన రోజు నాడు, 11 వేల రూపాయలు, రాజధాని అమరావతికి విరాళంగా ఇచ్చాడు ఈ బుడతడు.. దనందిపాడుకు చెందిన చిరంజీవి వరేణ్య, కుటుంబ సభ్యులు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు.
అంతే కాదు, ముఖ్యమంత్రికి నమస్కారం పెట్టిన ఆ బుడతడి సంస్కారం, పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని చూపించాయి... మన రాష్ట్రంలో ఉన్న ఏంతో మంది సంస్కారహీనులు, ఈ బుడ్డోడుని చుసైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం...