పొద్దున లెగిసిన దగ్గర నుంచి, తాను దూషించే పార్టీకి చెందిన ఎమ్మేల్యే గోరంట్ల ఇంటికి ముద్రగడ ఎందుకు వెళ్ళాడు ? కాపు ఉద్య‌మాన్ని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసి, చంద్రబాబుని తిట్టిన నానా బూతులు మర్చిపోయి, ఆ పార్టీ నేతనే కలిసారు అంటే, ఎందుకోసం ? కాపు ఉద్యమం గురించి, కాపుల సమస్యల గురించి ఒక్కసారి కూడా, అధికార పార్టీతో మాట్లాడని ముద్రగడ ఎందుకు ఇప్పుడు కలిసారు ?

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను పీడించుకుని తింటున్న ముద్రగడ వియ్యంకుడు కోసం, ఈ తాపత్రయం... ముద్ర‌గ‌డ‌కు కాపుల కంటే త‌న సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని మరోసారి రుజువైంది... త‌న వియ్యంకుడి అరాచకాలు సమర్ధించటం కోసం, త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ఎన్నారైకి చేసిన ద్రోహం ఇది...

విషయంలోకి వస్తే, ముద్ర‌గ‌డ వియ్యంకుడు బార్ల‌మూడి ర‌వికుమార్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న‌కు చెందిన ఓ భూమిని డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ఓ ఎన్నారైకి అప్ప‌గించారు. ఒప్పందం మేర‌కు ఆ భూమి డెవ‌లప్‌మెంట్‌లో భాగంగా ఆ ఎన్నారై దాదాపుగా కోట్లాది రూపాయల‌ మేర ఖ‌ర్చు చేశారు. ఇందులో భూ య‌జ‌మానిగా ఉన్న ర‌వికుమార్‌కు అడ్వాన్స్‌, స‌ద‌రు భూమి అపార్ట్‌మెంట్ల నిర్మాణం, ఆ భూమికి క‌ట్టాల్సిన ప‌న్నులు త‌దిత‌రాలు ఉన్నాయి. భూమికి ప‌న్నులు ర‌వికుమారే క‌ట్టాల్సి ఉన్నా, అత‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో... నిర్మాణ ప‌నులు ఎక్క‌డ ఆగిపోతాయోన‌న్న ఆందోళ‌న‌తో ఆ ఎన్నారై వాటిని చెల్లించారు. మొత్తం డెవ‌ల‌ప్‌మెంట్ పూర్తి అయిన త‌ర్వాత ఆ అపార్ట్‌మెంటులోని భూస్వామి హ‌క్కుల అగ్రిమెంట్ కింద‌ 75 ఫ్లాట్ల‌ను ర‌వికుమార్‌కు కేటాయించాల్సి ఉంది. అయితే నిర్మాణ ప‌నులు ఇంకా పూర్తి కాకుండానే, బిల్డ‌ర్ కు చెప్ప‌కుండా... అందులోని ఓ 18 ఫ్లాట్ల‌ను ర‌వికుమార్ అమ్మేసుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న డెవ‌ల‌ప‌ర్‌.. విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారై వాద‌న‌ను విన్న కోర్టు స‌ద‌రు ఫ్లాట్ల విక్ర‌యాల‌ను నిలిపివేస్తూ... ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు అప్ప‌గించ‌డానికి వీల్లేద‌ని చెబుతూ స్టే విధించింది. ఇక ఈ ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసిన వారి విష‌యానికి వ‌స్తే.. ముద్ర‌గ‌డ వియ్యంకుడిగా ఉన్న ర‌వికుమార్ పాపుల‌ర్ వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న చెప్పిందే త‌డ‌వుగా న‌గ‌రానికి చెందిన ఓ 18 మంది మిడిల్ క్లాస్ పీపుల్ వాటిని రూ.36 ల‌క్ష‌ల చొప్పున కొనుగోలు చేశారు. అయితే ఎంత‌కీ ఫ్లాట్లు త‌మ స్వాధీనంలోకి రాక‌పోవ‌డంతో వారంతా క‌లిసి ర‌వికుమార్‌పై ఒత్తిడి చేశారు. ఈ క్ర‌మంలోనే ర‌వికుమార్ వారిని ఫ్లాట్ల వ‌ద్ద‌కు తీసుకెళ్లి వాటికి వేసిన తాళాల‌ను ప‌గుల‌గొట్టించార‌ట‌. దీంతో షాక్ తిన్న ఎన్నారై... ఆ వెంట‌నే ఒప్పంద ప‌త్రాల‌ను ప‌ట్టుకుని కోర్టును ఆశ్ర‌యించారు.

మొత్తం వ్య‌వ‌హారాన్ని కోర్టు ముందుంచిన ఎన్నారై... ర‌వికుమార్ ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని, ఈ క్ర‌మంలో త‌న‌కు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఇది 30 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. కోర్టు కూడా బిల్డ‌ర్‌ వాద‌న వైపే మొగ్గి... ఎన్నారై బిల్డ‌ర్‌ ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని చెల్లించాల‌ని, అదే స‌మ‌యంలో 18 ఫ్లాట్ల విక్ర‌యాలు చెల్ల‌వ‌ని ర‌వికుమార్‌కు తేల్చి చెప్పింది. వివాదం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో ర‌వికుమార్ త‌న వియ్యంకుడు ముద్ర‌గ‌డ‌ను ఆశ్ర‌యించారు. కాపుల సంక్షేమమే త‌న ల‌క్ష్య‌మంటూ బీరాలు ప‌లికే ముద్ర‌గ‌డ‌... త‌న వియ్యంకుడు వ‌చ్చేసరికి కాపు ఉద్యమానికి కాస్తంత విరామం ఇచ్చేశార‌ట‌. ముందుగా త‌న మ‌నుషుల‌తో బిల్డ‌ర్‌ను బెదిరించారు. అతను బెద‌ర‌క‌పోవ‌డంతో త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ను రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలో వివాదాన్ని కోర్టు బ‌య‌టే సెటిల్ చేసుకోవాల‌ని ఎన్నారైకి ఆకుల నుంచి ఒత్తిడి వ‌చ్చింది. ఈ ఒత్తిడి నానాటికీ పెరిగిపోవ‌డంతో త‌ట్టుకోలేని స్థితిలో ఎన్నారై... అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల‌ను ఆశ్ర‌యించారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని వేడుకున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో ముద్ర‌గ‌డ బుచ్చ‌య్య‌ను క‌ల‌వాల్సి వ‌చ్చింది.

ముద్రగడ గారు, జాతి మొత్తం మిమ్మల్ని నాయకులుగా చూస్తున్నప్పుడు మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నటు వంటి మీ వియ్యంకుడికి వకాల్తా తీసుకోవటం న్యాయమా.... మీ కులానికే చెందిన యువకుల ఆర్ధిక పరిపుష్టికి మీరు దాహోదపడాలి తప్పితే, మీ శక్తి మొత్తం ఉపయోగించి అక్రమాల వియ్యంకుడికి అండగా నిలవడం సరైన పద్ధతి కాదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read