అమరావతిలో, పరిపాలన నగరంలోని ఐకానిక్ బిల్డింగ్స్ ఫైనల్ డిజైన్స్, నిర్మాణ ప్రణాళికలను సిద్దం చేయడానికి మరికొంత సమయం తీసుకోవాలని నార్మన్ ఫోస్టర్ బృందానికి ముఖ్యమంత్రి సూచించిచారు.. ప్రపంచంలోని తొలి 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటికి తలదన్నే రీతిలో ఆకృతులు తయారుచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. సీఆర్డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్టులు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్టులు, తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి వారిని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ బృందానికి సహకరించాలని సూచించారు ముఖ్యమంత్రి... 45 నిమషాల రివ్యూలో అనేక విషయాలు చర్చించారు... అందులో భాగంగానే ఒక్క సారి మాత్రమే, రాజమౌళి సలహాలు కూడా తీసుకోండి అని ముఖ్యమంత్రి అన్నారు...
అంతే ఒక్కసారిగా, ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో కులుకుతున్న మేధావులు బయటకి వచ్చారు... 45 నిమషాలు చంద్రబాబు చేసిన రివ్యూ పోయింది, ఒక్కసారి రాజమౌళి సలహాలు అన్నది మాత్రమే హైలైట్ అయ్యింది... అయినా, ఇక్కడ రాజమౌళి సలహాలు మాత్రమే ఇచ్చేది, డిజైన్ చెయ్యడు అనే విషయం తెలిసినా, విషం కక్కుతూనే ఉన్నారు...
ఇక డిజైన్స్ విషయానికి వస్తే, చంద్రబాబు ఏ చిన్న విషయంలో కూడా, తేలిగ్గా satisfy అవ్వరు... మరి అలాంటిది, భవిష్యత్తు తరం కోసం, మన దేశంలో ఈ శతాబ్దంలో కడుతున్న మొదటి రాజధాని, ఇంకా ఎంత గ్రాండ్ గా ఉంటుంది ? అందులోను ఇవి రెండు ఐకానిక్ బిల్డింగ్స్... ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నప్పుడు, ఎలా కంప్రోమైజ్ అవుతారు ?
చంద్రబాబుకి కావాల్సింది వన్ అఫ్ ది బెస్ట్ కాదు... ది బెస్ట్... హై టెక్ సిటీ లాంటి బిల్డింగ్ డిజైన్ ఫైనల్ చెయ్యటానికి, 15 సార్లు పట్టింది L&T కి, మరి ఇప్పుడు ? హైదరాబాద్ అంటే హై టెక్ సిటీ అనే స్థాయికి వెళ్ళింది ఆ బిల్డింగ్... ఈ కసరత్తు అన్నిట్లో ప్రభుత్వం చేస్తున్న తప్పు, పదే పదే డిజైన్స్ వదలటం... నిజానికి ఇది తప్పు కూడా కాదు, ప్రజలకి, ముఖ్యంగా అమరావతి రైతులకి, జరుగుతున్న ప్రతి విషయం తెలియటం కోసం, అన్ని ట్రాన్స్పరెంట్ గా, ప్రజల ముందు ఉంచుతున్నారు... దీంతో ప్రజలకి, కొంత ఫ్రస్ట్రేషన్ సహజం... కాని, మనకు ఎదో ఒక బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుంది అనుకుంటే, ఈ పాటికి అక్కడ కొన్ని వందల బిల్డింగ్స్ లేగిసేయి...
అమరావతి నిర్మాణం అంటే ఈ రెండు ఐకానిక్ బిల్డింగ్స్ మాత్రమే కాదు అని, అమరావతి మీద ఏడ్చే మేధావులు గుర్తించాలి... మౌలిక వసతులు ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నయో హైదరబాద్ నుంచి కాకుండా, అమరావతి వచ్చి చూడండి.... సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా రెడీ అవుతుందో చూడండి... దాదాపు 20 రహదారుల పనులు ఎలా జరుగుతున్నాయో చూడండి.. వీటితో పాటే, డ్రైనేజి, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ లాంటి పనులు కూడా జరుగుతున్నాయి.... అందుకనే కాలేజీలు, హాస్పిటల్స్, హోటల్స్ వస్తున్నాయి.... వరల్డ్ క్లాసు యూనివర్సిటీలు అయిన SRM, VIT ఇప్పటికే మొదలయ్యాయి కూడా... ఇంకా ఎన్నో వరల్డ్ క్లాస్ సంస్థలు, శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టాయి...
అమరావతి అంటే, ఇవి అన్నీ కలిస్తే అమరావతి... అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి... ఐకానిక్ బిల్డింగ్స్ కాబట్టి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటం కోసం, ది బెస్ట్ డిజైన్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... మా రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు ఇవన్నీ అర్ధం చేసుకున్నారు... హైదరాబాద్ లో కూర్చుని ఏడవటం ఆపి, మీ ఇంటి ముందు నిన్న పడిన వర్షానికి వచ్చిన నీళ్ళు తోడుకోండి...