నన్ను అవమానిస్తున్న వారు ఇక్కడ ఉన్నంత వరకు లోటస్ పాండ్ లో అడుగు పెట్టను... నా నగిరి నియోజకవర్గం చూసుకుంటూ అక్కడే ఉండి పోతా... ఏదేమైనా జగన్ అన్నని వదిలే ప్రసక్తే లేదు.... ఇవి రోజా చేస్తున్న శపధాలు...
మీడియా ముందు, మీటింగ్లలోనూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే రోజా, నంద్యాల, కాకినాడ ఫలితాలు తరువాత ఎక్కడా కనిపించటం లేదు... నంద్యాల ఓటర్ల దెబ్బకు చంద్రబాబు అబ్బా అంటాడు అని రోజా అన్న మాటలతో, నంద్యాల ప్రజలు రోజాకి తగిన స్థానం చూపించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న రోజాకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి రోజా ప్రజల ముందుకి రాలేక, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మొహం చాటేసే పరిస్థితివచ్చింది.
అయితే, ఇక్కడ ఇంకో విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతుంది... రోజాకి ఇలాంటి పరాభవాలు కొత్త కాదని, ఇంకా ఎదో జరిగింది అని ఆరా తియ్యగా, ప్రశాంత్ కిషోర్, కొంత మంది పార్టీ సీనియర్ల కారణంగా, రోజా ఇంకా నియోజకవర్గానికే పరిమితం కానుంది అంటున్నారు.. నంద్యాల, కాకినాడ ఫలితాలకి, రోజాని ప్రధాన కారణంగా ప్రశాంత్ కిషోర్ చూపటంతో, జగన్ ఆదేశాల మేరకు, పార్టీ సీనియర్ నేతలతో క్లాస్ ఇప్పించారు. మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని వాళ్ళు చెప్పటంతో, రోజా వాళ్ళ మీదే ఫైర్ అయ్యి, పార్టీ కోసం కష్టపడుతుంటే తనను తప్పుపట్టడం ఏంటి అని రగిలిపోయారు. నిన్న కాక మొన్న, ఎక్కడ నుంచో వచ్చినోడు, జీతం కోసం పని చేసే వాడు, నన్ను నిందిస్తారా అంటూ రోజా ఫైర్ అయిపోతున్నారు...
పార్టీ కోసం, జగన్ కోసం తాను అన్నింటిని భరిస్తున్నానని, నా మీద ఇంత కుట్ర జరుగుతుంటే, వీరంతా ఉంటున్న లోటస్ పాండ్ లో అడుగు పెట్టను అని... నా నియోజకవర్గానికే పరిమితం అయిపోతాను అని... కాని, జగన్ అన్నని అస్సలు వదిలి పెట్టను అంటున్నారు రోజా... మరి ప్రశాంత్ కిషోర్ ఎలా స్పందిస్తారో చూడాలి...