ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాసం కనిపిస్తుంది... కాపులని ముద్రగడ ద్వారా రెచ్చగొట్టి, పబ్బం గడుపు కోవలనుకుంటున్న జగన్ కు, ముద్రగడ జర్క్ ఇచ్చారు.

ఎవరూ ఊహించని విధంగా, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి ముద్రగడ పద్మనాభం వెళ్లారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ముద్రగడ సమావేశమయ్యారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం టీడీపీ ఎమ్మెల్యేతో భేటీ అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీ పై కాపులకు వ్యతిరేక ప్రభావం లేదనే సంకేతాన్ని ఇచ్చాయి. ముద్రగడ ఎంత గోల చేసినా, కాపు వర్గం అంతా చంద్రబాబు వెంటే నడిచారు. కాకినాడ లాంటి చోట కూడా కాపులు చంద్రబాబు వెంట నడవటంతో, రాష్ట్రం మొత్తం అదే వాతావరణం ఉన్నట్టే అంటున్నారు.

అలాగే.. చంద్రబాబు పాలనలో తమ సామాజిక వర్గానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనే భావన కాపు శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశంలో చంద్రబాబు లేరని, ఆయనతో సయోధ్యగా ఉంటే తమ కులానికి మరింత మేలు జరుగుతుందని కాపు ఉద్యమ నేతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం.

కాపు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం మంజునాథ్ కమిటీ వేసింది. అలాగే కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రుణాలు మంజూరు చేస్తోంది. విదేశి విద్యకు తోడ్పాటు ఇస్తున్నారు. దీంతో కాపులు కొంత సానుకూల వైఖరితో ఉన్నట్లు సమాచారం.

అయితే, ఇప్పుడు ముద్రగడ తెలుగుదేశంలో చేరతారా , లేక బీజేపీలో చేరుతారా అనే ఊహగానలు వస్తున్నాయి. మొత్తానికి, ముద్రగడ కూడా జగన్ ని నమ్ముకుంటే, మిగిలేది బూడిదే అనే అభిప్రాయానికి వచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read