ఆన్ని రకాల ఆటలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం నోవోటెల్ లో నిర్వహించిన 4వ ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంటును ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను, కామన్వెల్త్ క్రీడలను ఘనంగా నిర్వ హించామని గుర్తు చేశారు. భారత దేశంలో ప్రస్తుతం క్రికెట్ పై మక్కువ ఎక్కువగా వుందని, మిగిలిన క్రీడలను కూడ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో క్రీడలకు ఉత్తమ మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు. అమరావతిలో స్నూకర్ స్టేడియంను నిర్మిస్తామన్నారు. సంతోషమే సూచిగా పనిచేస్తామని, క్రీడలు, కల్చరల్ కార్యక్రమాలతో సంతోషం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించే స్థాయికి చేర్చుతామన్నారు.
భారత స్నూకర్ పెడరేషన్ ఆద్యక్షుడు కెప్టెన్ పి.వి. కె.మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్నూకర్ లో టాప్ 64 మంది క్రీడాకారులు పాల్గుంటున్నారని, అందులో 6 గురు వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పారు.
చంద్రబాబు ఈ సందర్భంగా స్నూకర్స్ ఆడారు, మీరూ చూడండి...