ప్రజా సేవ, ఆయన లక్ష్యం... ప్రజా సమస్యల పరిష్కారం నీతి కృత్యం... అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ప్రతిక్షం జనం గురించే, జనం కోసమే, జనమే ఊపిరిగా బ్రతికారు దివంగత నేత ఎర్రం నాయుడు... బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తూ, ఆయన రాజకీయ జీవితంలో చివరి వరకు పోరాడారు...

ఆయన వారసత్వం తీసుకుని, సిక్కోలు యువ సింహంలా గర్జిస్తూ... ఎర్రన్న అడుగుజాడల్లో ప్రజలకోసం ఉద్యమిస్తూ...
ప్రజాగళాన్ని...పార్లమెంటులో వినిపిస్తున్న యువ కిశోరం... కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రి బాటలోనే ప్రజా సమస్యలు తీరుస్తున్నారు... మంత్రి అచ్చెం నాయుడు కూడా సోదరుడి అడుగుజాడల్లో నడుస్తూ, అబ్బాయితో కలిసి సిక్కోలు ప్రజలకి సేవ చేస్తున్నారు...

తాజాగా ఒక సంఘటన వేలుగులోకే వచ్చింది... ఈ బాబాయ్ - అబ్బాయ్ కలిసి చేసిన పని చూసి, సిక్కోలు ప్రజలు ఎర్రన్నని గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు... సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన బాగా వైరల్ అవటంతో, మంత్రి నారా లోకేష్ కూడా, రామ్మోహన్ నాయుడుని మెచ్చుకున్నారు...

రవి కుమార్ సీరపు అనే యువకుడి మాటల్లో, జరిగిన సంఘటన, తన పోస్ట్ యదాతధంగా...

"గత నెల 30 తేది రాత్రి 9 గంటలు సమయంలో మా పక్కటి అమ్మయి పురిటి నోప్పులతో భాదపడుతు టెక్కలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేస్తే అ సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు.దసరా ఉత్సవాలు కు స్దానిక వైద్యలు విశాఖపట్నం,హైదరాబాదు లో ఉన్నారని తెలిసింది. ఇదే విషయాన్ని మా స్దానిక ఎమ్.ఎల్.ఎ (మంత్రి వర్యులు కింజిరాపు అచ్చెన్నాయడు కు ఫొన్ లో సమచారం ఇస్తే 5 నిమాషల వ్యవది లో అంబులెన్స్ సౌకర్యం కల్పించి శ్రీకాకుళం RIMS హాస్పిటల్ లో జాయిన్ చేసి వైద్యులు డిలావరి చేయడం జరిగింది. మరుపటి ( 1-10-2017) విజయ దశమి రోజు ఉదయం 8 గంటల సమయంలో శ్రీకాకుళం ఎమ్. పి శ్రీ (కింజరాపు రామ్మెన్నాయడు గారు) నాకు ఫొన్ చేసి అ తల్లిబిడ్దల యెగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలు సమయంలో మన రవాణా & బి.సి సంక్షేమ మంత్రి వర్యులు (కె.అచ్చెన్నాయడు గారు) నాకు ఫొన్ చేసి విజయ దశమి శుభాకాంక్షలు తెలియపరచి నన్ను అభినందిచడ‌‌౦ జరిగింది.
నేను చేప్పేది ఏమిటంటే ...ఎల్లప్పుడూ ఏ సమయంలో తెలుగు ప్రజలకు ఆపద వస్తే అదుకోనే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే...
బాబయ్-అబ్బాయ్ లకు నా ధన్యవాదాలు...
మీ
యస్. రవికుమార్ రెడ్డి"

Advertisements

Advertisements

Latest Articles

Most Read