సరిగ్గా అయిదేళ్ళ క్రితం... సుద్దీర్ఘ రాజకీయ అనుభవం, సైబెరాబాద్ లాంటి సిటీ కట్టిన విజన్ ఉన్న నాయకుడు, మరో పక్క అన్నగారు పెట్టిన పార్టీని 20 ఏళ్ళ పాటు ముందుకు తీసుకువచ్చిన నాయకుడు, ఈయన పని అయిపోయింది అనుకున్నారు అందరూ...
నిండు చంద్రబాబు ఒక వైపు, చుక్కలు ఒక వైపు అన్నట్టు... అన్ని పార్టీలు కలిసి, చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని కనుమరుగు చెయ్యటానికి కుట్ర పన్నారు.. మరో పక్క రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది...
ఇలాంటి పరిస్థుతులలో,
నిస్తేజంలో కాడర్ ఉంది....
పార్టిని వదిలి వెళ్తున్న నాయకులు ఒక వైపు...
అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి...
తెలుగుదేశం, చంద్రబాబు పని అయిపోయింది అనుకున్న జనం..
డిపాజిట్స్ గల్లంతయ్యే పరిస్థితి...
ఇదే సమయంలో కుటుంబంలో నుంచి కూడా సమస్యలు...
ఎదురుగా అవినీతి సొమ్ముతో, ఏడుపులు సానుభూతిని నమ్ముకున్న పార్టీ...
పంటి బిగువున దిగమింగారు...
ఆ సమయంలో చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది.... 60 ఏళ్ళ వయసు ఆయన ఉక్కు సంకల్పం ముందు చిన్నబోయింది.... పరీక్షించిన గాయాలు ఆయన చిత్తసుధిని శంకించలేకపోయాయి..... వస్తున్నా మీ కోసం అంటూ ఆయన మొదలెట్టిన పాదయాత్ర,దానిని కొనసాగించిన తీరు...రాష్ట్ర రాజకీయ యవనిక మీద చెరగని ముద్ర వేసాయ్..... జన రాజనాలు..... ఉప్పొంగిన ఉత్సాహం తో ముందుకు ఉరికిన కాడర్.....
ప్రపంచం లో ఎక్కడా లేనంత నీచం గా ఒక రాష్ట్రాన్ని విడకొట్టారు..... అక్కడ ఆయన వల్లే ఆగింది అని...ఇక్కడ ఈయన వల్లే జరిగింది అని దాడి....
కట్ చేస్తే....
పంచాయితీ ఎలక్షన్స్, మున్సిపల్ పరిషత్ ఎన్నికలు..... స్వీప్.... సార్వత్రిక ఎన్నికల టైంకి టిడిపి బలం నమ్మిన వారి చేరికలు... కొత్త ఇక్వేషన్స్.... పొత్తులు.... అయిపోయాడురా అన్న దగ్గర నుంచి మనల్ని నిలబెట్టేది ఈయనేరా అనేదాకా,ఈ ఐదేళ్ళ చంద్రబాబు ప్రస్థానం, ఏంతో మంది ముందు తరాల నాయకులకి ఆదర్శం... ఒక రాష్ట్రం లో ఇక లేదు అనుకున్న చోట, ప్రతిపక్షంగా....ఇంకొక రాష్ట్రంలో అధికార పక్షంగా నిలవటం ఒక చ్జరిత్ర.... ఇది ఒక కేసు స్టడీ.... ప్రజల పక్షాన నిలబడితే, ప్రజలు మన వైపే ఉంటారు అనే దానికి ఉదాహరణ...
ఆ పాదయత్రలో ఎదురైన ఎన్నో ప్రజా సమస్యలతో, ప్రజల అవసరాలతో పధకాలు వచ్చాయి...
అయిదేళ్ళ తరువాత, మరో సారి ఈయన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, చివరగా ఒక మాట...
"తన ఇంటిని విడిచి విడిచి........తన క్షేమం మరచి మరచి..... రైతులకై వగచి వగచి..... నిరుపేదల తలచి తలచి... బాటలెన్నో నడిచి నడిచి...... నడిచి నడిచి నడిచి నడిచి నడిచి....... అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు..."
"వస్తున్నా మీ కోసం" పాదయాత్రలో పాట ఇది...
అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు... అయినా ఈ పాటలో ఏమి మారలేదు... తన ఇంటిని కుటుంబాన్ని వదిలి, 67 ఏళ్ళ వయసులో నవ్యాంధ్ర నిర్మాణానికి పూనుకున్నారు... రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు.... పేదలకి ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు... మన భవిష్యత్తు కోసం, ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తిద్దాం...
ఏమిచ్చి ఈయన రుణం తీర్చోగలం... కాపాడుకుందాం ఇలాంటి నాయకుడ్ని... కులాలకతీతంగా... మతాలకతీతంగా... ప్రాంతాలకతీతంగా... వర్గాలకతీతంగా, కాపాడుకుందాం...