నిన్న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో, జరిగిన 'స్వచ్ఛతే సేవా' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు..

ఒంగోలికి చెందిన తేజస్విని అనే యువతి, ఒంగోలులో పోస్టర్ ఫ్రీ సిటీ కోసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడిన మాటలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజ్ఞులు అందరి అభిప్రాయాలు చెప్పినట్టు అయ్యింది...

నిన్న ఈనాడు పేపర్ లో, చంద్రబాబు కంటికి ఇబ్బంది వచ్చింది అని, కంటికి ఉన్న కురుపు బాగా ఇబ్బంది పెడుతున్నా, ఆ నొప్పిని భరిస్తూ, చంద్రబాబు అధికార కార్యక్రమాల్లో పాల్గుతున్నారు అని వార్తా ప్రచురించింది... ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది... అందరూ చంద్రబాబు ఆరోగ్యం బాగా చూసుకోవాలి అని, రెస్ట్ తీసుకోవాలని, మీరే మా భవిషత్తు అని పోస్టింగ్ లు పెట్టారు...

అయితే, స్టేజి మీద మాట్లాడే అవకాశం వచ్చిన తేజస్విని మన అందరి అభిప్రాయాలు ముఖ్యమంత్రికి చెప్పారు... "సార్ మీ కంటికి ఇబ్బంది వచ్చింది అని ఈనాడు పేపర్ లో చదివాం... మీ కళ్ళు, మీ విజన్ ఈ రాష్ట్రానికి చాలా అవసరం, మీరే మా భవిష్యత్తు... ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్" అంటూ చంద్రబాబుకి విన్నవించుకున్నారు... చంద్రబాబు నవ్వుతూ అభివాదం చేశారు..

ఈ రాష్ట్ర ప్రజలందరి తరుపున, మన ముఖ్యమంత్రి సరైన రెస్ట్ తీసుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read