అతడు ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. జీవచ్ఛవంలా మారిన బాలుడు షేక్ నాగుల్ మీరా. మంచానికే పరిమితమయ్యాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం నుంచి కుటుంబసభ్యులతో వచ్చి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశాడు. వైద్యచికిత్సకు కొద్దిపాటి ఆస్థిని కరిగించామని, అయినా తమ బిడ్డకు బాహ్య ప్రపంచం తెలియనివాడిగా మిగిలాడని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ బాధను చెప్పుకున్నారు..

బాలుని పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. ఆ డబ్బును నాగుల్ మీరా పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, నెలనెలా వచ్చే వడ్డీతో అతడి వైద్య ఖర్చులకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు నుంచి వచ్చిన త్రివేణి (15), వెంకట్ (12) మూగపిల్లలు. తమ బాధను చెప్పుకోలేని నిస్సహాయులు. శస్త్ర చికిత్స చేస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పిన మాటలు వారికి ఒయాసిస్సుల్లా అనిపించాయి. మాట వస్తుందన్న ఆశ ముందుకు నడిపిస్తుండగా శస్త్ర చికిత్సకు ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

వారి శస్త్ర చికిత్సకు రూ. 10 లక్షల వ్యయం అవుతుందని వైద్యులు తేల్చారు. శస్త్ర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలిద్దరి బాగోగులను చూసుకుంటామని హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్నామని, జరుగుబాటుకు పనిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని, సాయపడాలని వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం అందజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read