చంద్రబాబు ప్రయత్నాలు ఒక్కోటి ఫలిస్తున్నాయి... వడివడిగా అడుగులు వేస్తూ, ముందుకు సాగుతున్న రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్... నవ్యాంధ్రలో దేశంలోనే తొలి గూగుల్‌ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకానుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో గూగుల్‌ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది.

గూగుల్‌తో కలిసి నిర్వహిస్తున్న, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు సక్సెస్ కావటంతో, దేశంలోనే తొలి కోడ్‌ల్యాబ్‌ ను, గూగుల్ మన రాష్ట్రంలో ఏర్పాటుకు గూగుల్‌ ముందుకు వచ్చింది..

గూగుల్ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు అయితే, ఇంజినీరింగ్‌లో అండ్రాయిడ్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్‌ల తయారీపై ఏకథాన్‌, కోడ్‌ కాన్‌టెస్ట్‌లను నిర్వహిస్తారు.

ఇప్పటి వరకు గూగుల్ శిక్షణ ఇచ్చిన వివరాలు...
ఆంధ్రప్రదేశ్ లోని 82 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 17,425 మంది విద్యార్థులు గూగుల్‌ అండ్రాయిడ్‌ శిక్షణ పూర్తి చేసింది. ప్రస్తుతం మరో 2,498 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ పూర్తి చేస్తే, గూగుల్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే, ఉపాధి అవకాశాలు తేలికగా దొరకుతాయి... ఈ శిక్షణకు 6500 రూపాయిలు ఖర్చు అవుతుండగా, 50 శాతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సబ్సిడీ ఇస్తుంది. అలాగే స్కూల్ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఐదు నుంచి పదో తరగతి వరకు, 1,24,768 మంది పిల్లకు గూగుల్ శిక్షణ ఇచ్చింది.

మన దేశంలో రెండు మిలియన్ మొబైల్ డెవలపర్స్ తయారు చేయాలనే టార్గెట్ గూగుల్ పెట్టుకుంది. అందులో, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 శాతం ముంది ఉండాలనే టార్గెట్ తో, దేశంలోనే మొదటి గూగుల్ కోడ్ ల్యాబ్, మన రాష్ట్రంలో నెలకొల్పుతుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read