సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం (ఇన్నోవేటీవ్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది.

ఢిల్లీలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాస్టర్ కార్డ్ సంస్థ ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్ టెక్) తో అద్భుతాలు చేయవచ్చు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిని ఫిన్టెక్ వాలీకి ఆహ్వానించాలని మేము కోరుతున్నాం. డిజిటల్ ఎకానమీ అవినీతి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. భవిష్యత్ మొత్తం నాలెడ్జ్ ఆర్థికవ్యవస్థకు మాత్రమే ఉంటుంది." అన్నారు...

మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ భంగ మాట్లాడుతూ, "టెక్నాలజీని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి ముందుచూపు రాష్ట్రాన్ని నూతన స్థాయికి తీసుకోవడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో మాస్టర్ కార్డ్ వ్యాపార సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్రంలో సైబర్ భద్రత మరియు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పనిచేయడానికి మాస్టర్ కార్డ్ ముందుకు వచ్చింది." అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read