మనం ఏదైనా పని చేస్తామని చెప్పడం వేరు ఆ పని చేసి చూపించడం వేరు.. హామీ ఇవ్వడం వేరు ఆ విధంగా అడుగులు వెయ్యడం వేరు... తెలంగాణ ఐటి శాఖా మంత్రి కె. తారకరామారావు హామీ ఇచ్చారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వకుండా చేసి చూపించారు. వివరాల్లోకి వెళితే కేటీఆర్ సరిగా రెండేళ్ల క్రితం రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటుచేసి దేశ‌,విదేశాల్లోని ఎన్నారైలను ఆహ్వానించారు. వారి అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం పంచుకునేందుకు నిర్ణ‌యాలు వెలువ‌రిస్తామ‌ని తెలిపారు. దీంతోపాటుగా తెలంగాణ‌లో అధికంగా ఉన్న గ‌ల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం మెరుగైన పాల‌సీ తెస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోగా చాలా ఫైల్స్ మాదిరి అది కూడా అటక ఎక్కింది. తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవే అంశాలతో ఒక పాలసీని అమలు చెయ్యడానికి రంగం సిద్ధం చేశారు. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు (ఏపీ ఎన్‌ఆర్‌టీ) పాలక మండలి ప్రవా సాంధ్రుల సంక్షేమం – అభివృద్ధి కి సంబంధించి కొత్త పాలసీని ప్రకటించింది.

ఈ కార్యక్రమాల నిర్వహణకోసం రూ. 40 కోట్లను తొలివిడతగా కేటాయించిన ప్రభుత్వం... ఈ పాలసీలో భాగంగా .ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్‌, భరోసా, సహాయనిధి వంటి ముఖ్యమైన పథకాలకు శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు.ఏపీ ఎన్‌ఆర్‌టీలో సభ్యులుగా ఉన్న 42,600 మందికి ఈ కొత్తపాలసీ ద్వారా విస్తృత ప్రయోజనాలు కలిగేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగినా ప్రవాసాంధ్ర భరోసా పథకం ద్వారా రూ. 10లక్షల బీమా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి . విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోల్పోయినవారికి తక్షణ సాయం అందించేందుకు రూ. కోటితో ప్రవాసాంధ్ర సహాయ నిధిని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read