ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు.. వచ్చే ఎన్నికలకు గాను తన సైన్యాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని శాశ్వతం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణపై కూడా దృష్టి సారించారు..వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో గెలిచే వాళ్ళకే టికెట్స్ ఇస్తానని ఒకటికి నాలుగు సార్లు సర్వే చేయించి మరి సీటు ఇస్తానని స్పష్టం చేశారు.

అలాగే ప్రస్తుత శాశన సభ్యుల పని తీరు సరిగా లేకపోయినా తనకు సన్నిహితులు అయినా ఎవరు అయినా వారికి సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.. ఇందులో భాగంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి తన సైన్యాన్ని ప్రకటించారు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఆ విధంగానే తన టీంని ప్రకటించారు. ఉభయరాష్ట్రాలకు గాను పార్టీ అధ్యక్షులను , ఉపాధ్యక్షులను కార్యదర్శులను చంద్రబాబు ఎంపిక చేశారు.. వీటిలో పెద్దగా మార్పులు లేవనే చెప్పాలి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును నియమించగా, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ఆరుగురు ప్రధాన కార్యదర్శులుతో పాటు 105 మందితో ఏపీ టీడీపీ కమిటీని ఎన్నుకున్న చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణను నియమించగా తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నుకున్నారు. ఈ కమిటీలో 11 మంది అధికార ప్రతినిధులు, మొత్తంగా 114 మంది తెలంగాణ టీడీపీ కమిటీలో ఉన్నారు. కాగా త్వరలోనే అనుబంధ సంఘాలను కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read